Saturday, April 27, 2024

విశాఖపట్నం-కౌలాలంపూర్ కు విమానాలను తిరిగి ప్రారంభించిన AirAsia

- Advertisement -
- Advertisement -

విమానయాన రంగంలో అప్రతిహతంగా దూసుకుపోతోంది AirAsia. వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందిస్తున్న AirAsia.. ఎప్పటికప్పుడు తన విస్తారమైన నెట్‌వర్క్‌ను భారతదేశం నుండి మలేషియాకు వ్యాపింప చేస్తూనే ఉంది. అందులో భాగంగా తాజాగా… విశాఖపట్నం నుంచి కౌలాలంపూర్‌కు తిరిగి విమానాలను ప్రారంభించినట్లు ప్రకటించింది. కౌలాలంపూర్ నుంచి విశాఖపట్నానికి డైరెక్ట్ ఫ్లైట్ సేవలు అందిస్తున్న ఏకైక విమానయాన సంస్థ AirAsia కావడం విశేషం.

AirAsia 2024 ఏప్రిల్ 26 నుంచి విశాఖపట్నం నుండి మలేషియా రాజధాని కౌలాలంపూర్‌కు వారానికి మూడు సార్లు విమానాలను నడపబోతుంది. మలేసియా రాజధాని కౌలాలంపూర్ గురించి ఎలాంటి పరిచయం అవసరం లేదు. ఆగ్నేయాసియా యొక్క ఆభరణం కౌలాలంపూర్ నగరం. ఇక్కడ ప్రపంచంలోని రెండో ఎత్తైన ‘మెర్డెకా టవర్ 118’ ఇక్కడే ఉంది. అన్నింటికి మించి శక్తివంతమైన భిన్న సంస్కృతులు, ఆశ్చర్యగొలిపే సంప్రదాయాలను మనం ఇక్కడ చూడవచ్చు. ఆహార ప్రియులకు కౌలాలంపూర్ స్వర్గధామం. మలేయ్, చైనీస్, భారతీయ వంటకాల్లో విభిన్న రకాలనను ఇక్కడ ప్రతీ ఒక్కరూ ఆస్వాదించవచ్చు. సంక్లిష్టమైన హిందూ శిల్పాలు, పుణ్యక్షేత్రాలతో అలంకరించబడిన గుహలు, విస్మయాన్ని కలిగించే సున్నపురాయి కొండ, ఐకానిక్ ‘బటు గుహల’ ను సందర్శించేందుకు దూర ప్రాంతాల నుండి కూడా పర్యాటకులు తరచుగా నగరానికి వస్తుంటారు.

విశాఖపట్నం నుంచి కౌలాంలపూర్ కు తిరిగి విమాన సర్వీసులు పునరిద్ధరించినందుకు గుర్తుగా… విశాఖపట్నం నుండి కౌలాలంపూర్‌కి విమాన బుకింగ్ 14 ఫిబ్రవరి 2024 వరకు కేవలం రూ4,999* ప్రారంభ ధరతో బుక్ చేసుకోవచచు. అలాగే కౌలాలంపూర్ నుండి కేవలం RM199* తో బుక్ చేసుకోవచ్చు. ఇది 26 ఏప్రిల్ 2024 నుంచి 19 మార్చి 2025 మధ్య ప్రయాణం కోసం మాత్రమే. మరెందుకు ఆలస్యం… ఇప్పుడే airasia సూపర్ యాప్ కు వెళ్లండి. మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి!

ఈ సందర్భంగా AirAsia ఏవియేషన్ గ్రూప్ సీఈఓ బో లింగం మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ… “మాకు అతిపెద్ద అంతర్జాతీయ మార్కెట్‌లలో ఒకటి భారతదేశం. మేము అందరి ప్రయాణాన్ని సరసమైనదిగా, అందరికీ అందుబాటులో ఉండేలా చేయడం వల్ల వినియోగదారుల నుంచి రోజురోజుకి మద్దతు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో మా కనెక్టివిటీని మరింత పెంచుకుంటూ ముందుకు సాగేందుకు AirAsia సిద్ధంగా ఉంది. విశాఖపట్నం నుండి కౌలాలంపూర్‌కు డైరెక్ట్ ఫ్లైట్ అనేది మా విస్తరణ ప్రణాళికలో ప్రధాన అంకం. ఈ ఏడాది భారతదేశం నుండి ఇది మా నాలుగో రూట్ అని చెప్పేందుకు గర్వంగా ఉంది అని అన్నారు ఆయన.

“సుసంపన్నమైన సంస్కృతితో పాటు సహజ అద్భుతాలతో కూడిన అందమైన కౌలాలంపూర్‌కు ప్రయాణికులను కనెక్ట్ చేయడానికి మేము ఎదురుచూస్తున్నాం. అంతేకాకుండా మా విస్తారమైన నెట్‌వర్క్‌ ద్వారా భారతదేశం నుండి ప్రయాణికులను మలేషియాలోని ఇతర ప్రాంతాలకు, ఆగ్నేయాసియాలోని ఇతర ప్రాంతాలకు, మరింత దూర ప్రాంతాలకు అనుసంధానం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అద్భుతమైన విశాఖపట్నం సందర్శించడానికి మలేషియా రాజధాని నుండి ప్రయాణీకులంతా ఆసక్తిగా ఉన్నారు. ఈ విస్తరణ ద్వారా వివిధ సంస్కృతులకు భిన్నమైన వ్యక్తులను కలుపుతూ, ఎలాంటి ఇబ్బందులు లేని, చవకైన ప్రయాణాన్ని అందించాలనే మా అంకితభావాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. మేము 2024 వైపు ఇప్పుడు పురోగమిస్తున్నాం. దీంతో రాబోయే రోజుల్లో AirAsia భారతదేశంలో మా ఉనికిని మరింత విస్తరించడానికి మరియు మా రెండు దేశాల మధ్య, వెలుపల మరింత సరసమైన కనెక్టివిటీని అనుమతించాలని చూస్తోంది అని అన్నారు.

ఈమధ్యే భారతదేశం నుండి కౌలాలంపూర్‌కు మరో మూడు కొత్త రూట్‌లను ప్రకటించింది AirAsia. గతేడాది ఫిబ్రవరిలో తిరువనంతపురం, కొచ్చి, ఏప్రిల్‌లో జైపూర్, మేలో అహ్మదాబాద్, ఆ తర్వాత కేరళ నుండి AirAsia సేవలు అందిస్తోంది. అంతేకాకుండా, AirAsia.. సిస్టర్ ఎయిర్ లైన్ అయినటువంటి AirAsia Xతో కలిసి దక్షిణ భారతదేశంలోని ఆరు నగరాల నుండి అంటే చెన్నై, తిరుచిరాపల్లి, కొచ్చి, హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా నుండి అలాగే ఉత్తరాదిలోని న్యూఢిల్లీ, అమృత్‌సర్ నుంచి సేవలు అందిస్తోంది. మరోవైపు అందరికి అందుబాటులో ఉండేలా సరసమైన ఫ్లై-త్రూ ఆప్షన్స్ కూడా అందిస్తుంది. భారతదేశం నుండి మలేషియాకు ప్రయాణించే అతిథులు కౌలాలంపూర్‌ను 22 దేశాలలో 130 కంటే ఎక్కువ గమ్యస్థానాలకు ఎయిర్‌ఏషియా కనెక్టింగ్ హబ్‌గా ఉపయోగించుకోవచ్చు.

AirAsia అతిథులు 9 ఏప్రిల్ 2024 నుండి వారానికి మూడుసార్లు ఫ్రీక్వెన్సీతో విశాఖపట్నం నుండి థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌కు నేరుగా ప్రయాణించవచ్చు. AirAsiaకు సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ కోసం ఇన్ స్టాగ్రామ్ లో మమ్మల్ని @flyairasia.in ఫాలో అవ్వండి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News