Saturday, May 4, 2024

ఒక వేళ నేను మరణిస్తే…

- Advertisement -
- Advertisement -

US Doctor

 

న్యూయార్క్‌ : అమెరికాలో అందరికంటే ఎక్కువగా కరోనా బాధితులకు నిత్యం సేవలందించే వైద్య సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. కరోనా కట్టడికి సదుపాయాలు తగినంతగా లేకపోవడం వల్ల ప్రమాదకర పరిస్థితుల్లోనే వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది రోగులకు సేవలందిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వైద్య సిబ్బందికి కూడా ఈ వైరస్ సోకుతోంది. ఈ నేపథ్యంలో ఓ వైద్యురాలు చేసిన మెస్సేజ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. న్యూయార్క్‌కు చెందిన మహిళా డాక్టర్ కరోనా వార్డులో సేవలందిస్తోంది.

కరోనా వైరస్ తీవ్రతను తెలియజేస్తూ ఆమె ఒక సందేశం ఇచ్చింది ‘ నా పిల్లలు చాలా చిన్న వాళ్లు. వారు ఈ సందేశం చదవలేరు. నేను మెడికల్ సూట్‌లో ఉన్నాను. కాబట్టి కనీసం నన్ను గుర్తు పట్టనూ లేరు. ఒక వేళ నేను కోవిడ్19 (కరోనా వైరస్) వల్ల మరణించాననుకోండి. నేను కోరుకునేది ఒక్కటే. వారి తల్లి బతికున్నంత వరకూ ఎంతో కష్టపడి విధులు నిర్వర్తించారని తెలుసుకోవాలని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేసింది. దీనిపై స్పందించిన నెటిన్లు ఆమెకు సెల్యూట్ చేస్తున్నారు. ‘ ఇది చదువుతుంటే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

US Doctor Heartbreaking Post For Her Children
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News