Saturday, May 4, 2024

తెలంగాణ ‘రైస్ బౌల్ ఆఫ్ ఇండియా’గా మారుతుంది: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR

 

హైదరాబాద్: వచ్చే ఏడాది కనీసం 70 లక్షల ఎకరాల్లో వరిసాగు జరుగుతుందని సిఎం కెసిఆర్ తెలిపారు. రాష్ట్రంలో వరి పంట సాగు, ధాన్యం దిగుబడులు, బియ్యం తయారీ-అమ్మకం-ఎగుమతులకు అవలంభించాల్సిన విధానాలు తదిర అంశాలపై సోమవారం ప్రగతి భవన్‌లో సిఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ.. ”తెలంగాణ ప్రతి ఏడాది కనీసం 2.25 కోట్ల లక్షల టన్నుల క్వింటాళ్ల ధాన్యం పండిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ‘రైస్ బౌల్ ఆఫ్ ఇండియా’గా మారుతుంది. కరోనా ప్రభావంతో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో ఇంత పెద్ద ఎత్తున పండిన ధాన్యాన్ని సేకరించి, మిల్లుకు పంపి బియ్యం తయారు చేసి, వాటిని అమ్మడం చాలా పెద్ద పని. దీనికోసం ఇప్పుడున్న పద్ధతి పనికి రాదని, ఎక్కడా ఎవరికీ ఇబ్బంది లేకుండా పండిన ధాన్యం బియ్యంగా మారి అమ్మకం జరిగే వరకు అన్ని సజావుగా సాగాలంటే సమగ్ర ధాన్యం,బియ్యం విధానం అమలు చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా 2200 రైస్ మిల్లులున్నాయి. ఈ మిల్లులు ఏడాదికి కోటి లక్షల టన్నుల బియ్యం తయారు చేస్తాయి. గతంలో వీటికి సరిపడా ధాన్యం కూడా రాకపోయేది. కరెంటు ఉండకపోయేది. ఫలితంగా 20-30 లక్షల టన్నుల బియ్యం తయారు చేయడం కష్టంగా ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ధాన్యం పుష్కలంగా ఉంది. 24 గంటల నిరంతరాయ కరెంటు ఉంది. దీన్ని మంచి అవకాశంగా మార్చుకుని రైసు మిల్లులు ఎక్కువ మొత్తంలో వడ్లు పట్టాల్సి ఉంది. రాష్ట్ర ప్రజల అవసరాలు తీరడమే కాకుండా ఎఫ్‌సిఐకి పంపించడానికి, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడానికి అనువుగా మిల్లులు పూర్తి సామర్థ్యంతో పని చేయాలి. ఇంకా మరికొన్ని మిల్లులు రావాలి. దీనికోసం ప్రభుత్వ పరంగా రైసుమిల్లులు బాగా నడవడానికి, అవి లాభాల్లో ఉండడానికి ప్రభుత్వ పరంగా చేయాల్సిన సాయం చేస్తాం. తెలంగాణలోని రైసు మిల్లులు రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలి” అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

CM KCR Press Meet at Pragathi Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News