Sunday, May 19, 2024

గాయని కనికా కపూర్ ప్లాస్మా దానం ఇప్పుడు అక్కరలేదు

- Advertisement -
- Advertisement -

Kanika Kapoor

 

లక్నో : కరోనా రోగుల చికిత్స కోసం ప్లాస్మా దానం చేయడానికి బాలీవుడ్ గాయని కనికాకపూర్ 15 రోజుల క్రితమే సంసిద్ధత వ్యక్తం చేసినప్పటికీ ఆమె కుటుంబ వైద్య చరిత్ర ప్రకారం ఆ ప్లాస్మాను ఉపయోగించబోమని కింగ్‌జార్జి మెడికల్ యూనివర్శిటీ (కెజిఎంయు) డాక్టర్లు చెప్పారు. ప్లాస్మా థెరపీ అన్నది ఇప్పుడు ఇంకా ట్రయల్ దశలో ఉంది. కరోనా లక్షణాలు బయటపడినా కనికా కపూర్ బయటకు చెప్పకుండా గోప్యం ఉంచడంతో ఆమెపై పోలీసు కేసు దాఖలైంది. ఏప్రిల్ 27న కపూర్ ప్లాస్మా దానం చేస్తానని ప్రకటించింది. అయితే దీనిపై ఆమెకు రక్త పరీక్షలు జరిగాయి. అయితే ఆమె కుటుంబ వైద్య చరిత్ర ప్రకారం ఇప్పుడు కరోనా రోగుల చికిత్స కోసం ఆమె ప్లాస్మాను తీసుకోలేమని, కానీ పరిశోధనకు ఆమె ప్లాస్మాను ఉపయోగించడానికి యోచిస్తామని కెజిఎంయు ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ విభాగం అధినేత డాక్టర్ తూలికా చంద్ర చెప్పారు. ఆ ఆస్పత్రిలో కరోనా నుంచి కోలుకున్న వారిలో ఐదుగురు ఇంతవరకు ప్లాస్మా దానం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News