Friday, May 3, 2024

బాయ్ తీరుపై ప్రణయ్ ఫైర్

- Advertisement -
- Advertisement -

Shuttler Prannoy is furious on Badminton association of india

 

న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) తీరుపై స్టార్ షట్లర్ హెచ్.ఎస్. ప్రణయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రతిష్టాత్మకమైన క్రీడా అవార్డుల నామినేషన్స్‌లో తనకు మరోసారి అన్యాయం జరిగిందని ప్రణయ్ విమర్శించాడు. కిందటిసారి కూడా కూడా తనకు అన్యాయం చేసిన బ్యాడ్మింటన్ సమాఖ్య ఈసారి కూడా అదే తీరుతో వ్యవహరించిందని మండిపడ్డాడు.

ఒక్క ప్రముఖ టోర్నమెంట్‌లో కూడా టైటిల్ సాధించని క్రీడాకారుడికి అర్జున అవార్డు కోసం సిఫార్సు చేసిన బాయ్ తనపై మాత్రం మరోసారి వివక్షను కనబరిచిందని ఆరోపించాడు. తాను ప్రతిష్టాత్మకమైన కామన్వెల్త్ గేమ్స్, ఆసియా ఛాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించానని అయినా తనను కాదని సమీర్ వర్మ పేరును అర్జున అవార్డు కోసం సిఫార్సు చేయడాన్ని ప్రణయ్ తప్పుపట్టాడు. 2020 సంవత్సరానికి క్రీడా పురస్కారాల కోసం భారత క్రీడా మంత్రిత్వ శాఖ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ గడువు బుధవారంతో ముగిసింది.

కాగా, వివిధ క్రీడా సంఘాలు ఆయా అవార్డుల కోసం తమ తమ క్రీడాకారుల పేర్లను అవార్డుల కోసం ప్రతిపాదించాయి. రాజీవ్‌గాంధీ ఖేల్త్న్ర, అర్జున, ద్రోణాచార్య తదితర అవార్డుల కోసం ఆయా క్రీడా సంఘాలు తమ తమ క్రీడాకారులు, కోచ్‌ల పేర్లను సిఫార్సు చేశాయి. కాగా, ఈసారి కూడా స్టార్ షట్లర్ ప్రణయ్‌కు నిరాశే మిగిలింది. కిదాంబి శ్రీకాంత్‌తో పాటు ప్రపంచ బ్యాడ్మింటన్‌లో ప్రణణ్ ఓ వెలుగు వెలిగాడు. అగ్రశ్రేణి ఆటగాళ్లను సయితం ఓడించి సత్తా చాటాడు. శ్రీకాంత్ తర్వాత అంతటి ప్రతిభ కలిగిన భారత షట్లర్‌గా ప్రణయ్ పేరు తెచ్చుకున్నాడు. కానీ, భారత బ్యాడ్మింటన్ సంఘం మాత్రం ప్రణయ్‌పై పక్షపాతంగానే వ్యవహరిస్తోందని చెప్పాలి.

అతని పేరును ఒక్కసారి కూడా క్రీడా అవార్డుల కోసం ప్రతిపాదించలేదు. ఈసారైన ప్రణయ్‌కు న్యాయం జరుగుతుందని అందరూ భావించారు. కానీ ఈసారి కూడా అతనికి నిరాశే మిగిలింది. అతని పేరును అవార్డుల కోసం సిఫార్సు చేయడంలో బ్యాడ్మింటన్ సంఘం ఆసక్తి చూపించలేదు. దీంతో బాయ్ తీరుపై ప్రణయ్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించాడు. దేశంలో ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఏమాత్రం గుర్తింపు లేకుండా పోయిందని వాపోయాడు. అవార్డుల కోసం ప్రతిభావంతులైన ఆటగాళ్ల పేర్లను సిఫార్సు చేయకుండా బాయ్ పక్షపాతం చూపుతోందని వాపోయాడు. బాయ్ తీరుతో తనలాంటి చాలా మంది క్రీడాకారులకు తీరని అన్యాయం జరుగుతుందని ప్రణయ్ వాపోయాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News