Thursday, May 16, 2024

జాతీయపక్షితో జాతి నాయకుడు

- Advertisement -
- Advertisement -

PM Modi feeding to Peacock viral video

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొవిడ్ పరిస్థితుల్లో ఇంట్లో ఎలా గడుపుతున్నదానిపై ఓ వీడియో విడుదల చేశారు. ఈ సారి జాతీయ పక్షి నెమలితో కాలక్షేపం చేస్తూ కనిపించారు. 1.47నిమిషాల నిడివికలిగిన వీడియోలో నెమలితో వివిధ సందర్భాల్లో గడిపిన తీరు అందులో కనిపిస్తోంది. అరచేతిలో ధాన్యం పట్టుకుని స్వయంగా నెమళ్లకు తినిపిస్తున్న దృశ్యాలు.. విధుల్లో భాగంగా బయటకు వెళుతున్నప్పుడు, మార్నింగ్, ఈవినింగ్ వాక్ చేస్తుండగా నెమలి ప్రధానమంత్రికి అతి సమీపంలో తచ్చాడుతూ.. పురివిప్పుతున్న సుందర దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. ఇంట్లో ఉన్న సమయంలో అందరు ఎలాగైతే ఉంటారో ప్రధాని మోడీ కూడా సాధారణ దుస్తుల్లో కనిపించడమే కాకుండా ప్రకృతి ప్రేమికుడిని తలపించారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు విపరీతంగా ఆకట్టుకుంటోంది.

PM Modi feeding to Peacock viral video

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News