Friday, April 26, 2024

ఈ ఏడాది చివరి నాటికి కొవిడ్-19 వ్యాక్సిన్

- Advertisement -
- Advertisement -

ఈ ఏడాది చివరి నాటికి కొవిడ్-19 వ్యాక్సిన్
– కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్

India will get Corona Vaccine by end of 2020: Harsh Vardhan

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా కేసుల సంఖ్య మూడు మిలియన్లు దాటింది. ఈ మహమ్మారి బారిన పడి అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా నివారణకు కొవిడ్ 19 వ్యాక్సిన్‌ను 2020 చివరి నాటికి సిద్ధం చేయనున్నట్లు కేంద్ర మంత్రి హర్షవర్థన్ శనివారం తెలిపారు. ‘కొవిడ్ 19 వ్యాక్సిన్లలో ఒకటి క్లినికల్ ట్రయల్స్‌లో మూడో దశలో ఉందన్నారు. మేం ఎంతో నమ్మకంగా ఉన్నాం.. ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువస్తాము’ అని పేర్కొన్నారు. భారత్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,044,940కు చేరింది. శనివారం ఒక్కరోజే 68,898 కేసులు నమోదవ్వగా.. 983 మంది మృతి చెందారు. 22.71 లక్షల మంది డిశ్చార్జి అయ్యారు.

India will get Corona Vaccine by end of 2020: Harsh Vardhan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News