Sunday, May 5, 2024

8 రోజుల్లో 5 లక్షల కేసులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య 5 లక్షలకు చేరుకోడానికి రోజుల సంఖ్య స్థిరంగా ఉండడం మొట్టమొదటి సారి. కేవలం ఎనిమిది రోజుల్లోనే కేసుల సంఖ్య 20 లక్షల నుంచి 25 లక్షలకు చేరుకుంది. అంతకు ముందు ప్రతి ఐదు లక్షల సంఖ్యకు తక్కువ రోజులే పట్టాయి. శుక్రవారం కొత్తగా 70,000 కేసులు నమోదు కావడంతో నిర్ధారణ అయిన మొత్తం కేసుల సంఖ్య మూడు మిలియన్లకు (30 లక్షలకు) చేరుకుంది. అదే కాలంలో ఇంకా వైరస్ నుంచి కోలుకోవలసిన క్రియాశీల(యాక్టివ్) కేసుల సంఖ్య కూడా శుక్రవారం 7 లక్షలకు దాటడం గమనార్హం. కొంచెం తక్కువ రేటులో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. ఎందుకంటే కొత్త కేసుల్లో 90 శాతం ప్రతి రోజూ వైరస్ నుంచి కోలుకున్న వారితో భర్తీ అవుతోంది
పంజాబ్‌లో మళ్లీ పెరుగుతున్న కేసులు
ఈలోగా పంజాబ్‌లో మళ్లీ కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ పెరుగుదల రేటు రోజుకు 4.l41 శాతం వరకు ఉంటోంది. ఈ రేటును ఏడు రోజుల సరాసరి లెక్కించి చూడగా జాతీయ రేటు 2.34 శాతం కన్నా ఎక్కువే కనిపిస్తోంది. ఈ రాష్ట్రంలో నిర్ధారణ కేసుల సంఖ్య 40,000 దాటింది. వీటిలో 70 శాతం అంటే దాదాపు 29,000 కేసులు గత నెలలోనే బయటపడ్డాయి. ఇంతవరకు పంజాబ్‌లో 1000 మరణాలు సంభవించడంతో దేశంలో ఎక్కువ మరణాల జాబితాలో ఈ రాష్ట్రం చేరింది. ఈ కేసుల సంఖ్యను తగ్గించడానికి వారాంతపు లాక్‌డౌన్లను పంజాబ్ అమలు చేస్తోంది. అయితే అంత సమర్ధంగా జరగడం లేదు. వచ్చేవారానికి కేసుల పెరుగుదల శాతం తగ్గకుంటే సెప్టెంబర్ నుంచి మరింత కఠిన చర్యలు అమలు చేస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చెప్పారు.

మహారాష్ట్ర లోని నాందేడ్ నుంచి భక్తులు తిరిగి రావడంతో ప్రారంభంలో కేసుల సంఖ్య ముమ్మరంగా పెరిగినా ఇప్పుడు కరోనా పంజాబ్‌లో చెప్పుకోతగినంతగా తగ్గుతూ వస్తోంది. కొత్త కేసుల సంఖ్య ఏక సంఖ్యకు తగ్గాయి. అయితే గత ఒకటిన్నర నెలల కాలంలో కేసులు విపరీతంగా పెరుగుతూ వచ్చాయి. ఢిల్లీలో కరోనా మహమ్మారి కేసుల పరిస్థితిలో చెప్పుకోతగిన తగ్గుదల కనిపించింది. గత నెలన్నర రోజులుగా సగం కన్నా ఎక్కువ తగ్గుదల వస్తోంది. ఈ నెల మొదట్లో వెయ్యి కన్నా తక్కువ రోజూ నమోదౌతుండగా ఇప్పుడు కొంచెం ఎక్కువౌతున్నాయి. ఇప్పుడు ఢిల్లీ నగరంలో 1200 నుంచి 1400 వరకు రోజూ కొత్తగా కేసులు నమోదౌతున్నాయి. కోలుకున్న వారి సంఖ్య కన్నా నమోదౌతున్న కొత్త కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. యాక్టివ్ కేసులు కూడా మెల్లగా పెరుగుతున్నాయి. కొంతకాలం వరకు మరణాల సంఖ్య తక్కువ గానే కనిపించినా గత రెండు వారాలుగా రెండు సందర్భాలు తప్ప మిగతా రోజుల్లో 20 కన్నా ఎక్కువగా మరణాలు నమోదయ్యాయి.

India seen 5 lakhs Corona Cases in just 8 Days

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News