Saturday, September 21, 2024

కోలీవుడ్ బుల్లితెర నటుడు సెల్వర్ తినమ్ హత్య

- Advertisement -
- Advertisement -

Tamil TV serial actor Selvarathinam hacked to death

 

చెన్నై: కోలీవుడ్ బుల్లితెర నటుడు సెల్వర్ తినమ్ గుర్తు తెలియని దుండగలు హత్య చేసిన సంఘటన తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని ఎంజిఆర్ నగర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సెల్వర్ తినమ్ శ్రీలంక నుంచి తమిళనాడుకు వలస వచ్చాడు. తిన్ మోజీ బిఎ సీరియల్ లో విలన్ గా నటిస్తున్నాడు. మణి అనే అసిస్టెంట్ డైరెక్టర్ సెల్వర్ కు ప్రాణ స్నేహితుడు. ఆదివారం సెల్వర్ ఇంటి నుంచి మణికి ఫోన్ వచ్చింది. సెల్వర్ ను ముక్కలు ముక్కలుగా నరికారని ఫోన్ రావడంతో వెంటనే పోలీసులకు మణి సమాచారం ఇచ్చాడు. పోలీసులు, మణి ఘటనా స్థలానికి చేరుకునేసరికి సెల్వర్ ప్రాణాలు విడిచాడు. ఇంట్లో సిసి కెమెరా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నలుగురు దుండగులు ఆటోలో వచ్చి సెల్వర్ తో గొడవకు దిగారు. అనంతరం నలుగురు సెల్వర్ ను కత్తులతో నరికి పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని రాయ్ పట్టే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సెల్వర్ తన భార్య, పిల్లలతో కలిసి విధురనగర్ లో నివసిస్తున్నాడు. గత పది సంవత్సరాల నుంచి విజయ టివిలో వస్తున్న తిన్ మోజీ, స్టార్ భారత్ హిందీ టివిలో నిమ్కి ముఖియా సీరియల్ లో నటిస్తున్నారు. కోలిమావు కోకిల సినిమాలో నయనతారతో కలిసి నటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News