Saturday, May 4, 2024

విమానాల్లో డైపర్లు ధరించండి: చైనా

- Advertisement -
- Advertisement -

China tells use diapers on flights

బీజింగ్: కోవిడ్ రిస్క్ ను తట్టుకునేందుకు చైనా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో తిరిగే విమానాల్లోని సిబ్బందికి కేబిన్ క్రూ.. పిపిఇకిట్లు, డైపర్లు ధరించాలని చైనా విమానయాన శాఖ సూచించింది. ప్లేన్ లోని బాత్రూమ్ వాడకం తగ్గిస్తే, ఇన్ఫక్సన్ బారినపడే అవకాశాలు తగ్గుతాయని 38 పేజీల తాజా గైడ్ లైన్స్ లో ప్రస్తావించింది. 500 పైగా కోవిడ్-19 కేసులున్న దేశాలకు వెళ్లే విమానాల్లో ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని రూల్ పెట్టింది. ఫ్లైట్ క్రూ మాస్కులు, కళ్లద్దాలు ధరిస్తే చాలని, వారికి డైపర్లు అవసరంలేదని విమానయాన శాఖ పేర్కొంది. కరోనా విజృంభణ కారణంగా ప్రపంచదేశాలు స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. ఇటీవల లాక్ డౌన్ ముగిసిపోవడంతో విమానయాన సర్వీసులు మళ్లీ ప్రారంభమవుతున్నాయి. కోవిడ్ దెబ్బకు కుదేలైనా చైనా విమానయాన రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని సంభంధిత అధికారులు చెబుతున్నారు.

China tells use diapers on flights

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News