Tuesday, April 30, 2024

నిలకడగా బెంగాల్ మాజీ సిఎం బుద్ధదేవ్ భట్టాచార్య ఆరోగ్యం

- Advertisement -
- Advertisement -

Ex-Bengal CM Buddhadeb's health condition improves

కోల్‌కత: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య ఆరోగ్య పరిస్థితి కొద్దిగా మెరుగుపడిందని, అయితే ఆయన ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని ఆసుపత్రి వర్గాలు గురువారం తెలిపాయి. 76 సంవత్సరాల భట్టాచార్య ప్రస్తుతం వెంటిలేటర్‌పైనే ఉన్నారని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. భట్టాచార్య ఆరోగ్య పరిస్థితి స్వల్పంగా మెరుగుపడిందని, క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్(సిఓపిడి)తో బాధపడుతున్న ఆయన మెకానికల్ వెంటిలేటర్ సపోర్ట్‌పైన ఉన్నారని ఆయన చికిత్స పొందుతున్న ఆసుపత్రికి చెందిన సీనియర్ వైద్యుడు తెలిపారు. భట్టాచార్య గుండె, నాడీ వ్యవస్థ, రక్త ప్రసరణ, శ్వాస కోశ పరిస్థితి నిలకడగా ఉన్నాయని ఆయన చెప్పారు. సిపిఎంకు చెందిన సీనియర్ నాయకుడైన భట్టాచార్య ఆరోగ్య పరిస్థితిని ఏడుగురు సభ్యుల వైద్యుల బృందం సమీక్షించింది. మెకానికల్ వెంటిలేషన్‌పైన ఆయన నేడు కూడా కొనసాగుతారని, వెంటిలేటర్ సపోర్ట్‌ను క్రమంగా తొలగించే ప్రక్రియపై నిర్ణయం తీసుకుంటామని డాక్టర్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News