Saturday, May 18, 2024

మెస్సి అరుదైన రికార్డు..

- Advertisement -
- Advertisement -

బార్సిలోనా: అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సి ఫుట్‌బాల్‌లో సరికొత్త రికార్డుతో చరిత్ర సృష్టించాడు. బార్సిలోనాలో ప్రాతినిథ్యం వహిస్తున్న మెస్సి ఆ జట్టు తరఫున 644వ గోల్ సాధించి కొత్త ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ క్రమంలో ఫుట్‌బాల్ చరిత్రలోనే ఓ క్లబ్ తరఫున అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా అరుదైన రికార్డును సాధించాడు. ఇప్పటి వరకు బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలె పేరిట ఉన్న 643 గోల్స్ రికార్డును మెస్సి తిరగ రాశాడు. లా లీగా టోర్నమెంట్‌లో భాగంగా రియల్ వల్లడోలిడ్‌తో జరిగిన మ్యాచ్‌లో సాధించిన గోల్‌తో మెస్సి ఈ రికార్డును నెలకొల్పాడు. 33 ఏళ్ల మెస్సి సుదీర్ఘ కాలంగా బార్సిలోనా క్లబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

Lionel Messi World Record With More Goals

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News