Sunday, May 19, 2024

దేవాలయంలో పెళ్లి… ఉరేసుకున్న యువతి, యువకుడు

- Advertisement -
- Advertisement -

Youth Girl Found Hanging From Tree

భువనేశ్వర్: దేవాలయంలో పెళ్లి చేసుకొని యువతి, యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్‌గిరి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎంవి 42 అనే గ్రామంలో యువతి, యువకుడు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియడంతో మందలించారు. ఇద్దరు గ్రామ శివారులో ఉన్న దేవాలయానికి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. అనంతరం యువతి, యువకుడు దగ్గరలోని చెట్టుకు ఉరేసుకున్నారు. వాళ్ల ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. మరో ఘటన పూరీ జిల్లాలోని సత్యబాది పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్గుమ్ గ్రామ పంచాయతీలోని పొలంలో యువతి, యువకుడు చెట్టుకు ఉరేసుకున్నారు. వాళ్ల చేతులు వెనకకు కట్టేసి ఉండడంతో వాళ్లను చంపేసిన అనంతరం ఉరేశారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News