Thursday, May 16, 2024

కమల్‌హాసన్ కారుపై దాడి… మందుబాబు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

 

చెన్నై: మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ కారుపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. కాంచీపురంలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా మద్యం ప్రియుడు కమల్ కారు అద్దాలను పగలగొట్టాడు. దీంతో మక్కల్ నీది మయ్యమ్ పార్టీ కార్యకర్తలు మందుబాబును చితక్కొట్టారు. వెంటనే పోలీసులు మందుబాబును అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. డిఎంకె, ఎడిఎంకె, పలు పార్టీలు ప్రచారం సాగిస్తున్నాయి. కోయంబత్తూరు దక్షిణ స్థానం నుంచి కమల్‌హాసన్ పోటీ చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News