Thursday, May 16, 2024

కరోనాతో 1952 మంది రైల్వే ఉద్యోగుల మృతి

- Advertisement -
- Advertisement -

1952 Railway employees died with Corona

రోజూ వెయ్యిమంది వరకు బాధితులు

న్యూఢిల్లీ : గత ఏడాది మార్చి నుంచి ఇప్పటివరకు రైల్వే ఉద్యోగులు 1952 మంది కరోనాతో మృతి చెందారని, రోజూ వెయ్యిమంది కరోనా బారిన పడుతున్నారని రైల్వేబోర్డు ఛైర్మన్ సునీత్ శర్మ సోమవారం వెల్లడించారు. సిబ్బంది ఆరోగ్యభద్రత కోసం రైల్వే ఆస్పత్రుల్లో అన్ని వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేశామని, ప్రస్తుతం 4000 పడకలపై సిబ్బంది , వారి కుటుంబీకులు చికిత్స పొందుతున్నారని వివరించారు. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ గురించి మాట్లాడుతూ దేశం లోని వివిధ రాష్ట్రాలకు ఏప్రిల్ 19 నుంచి 295 ట్యాంకర్ల ద్వారా దాదాపు 4700 టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ రైల్వే అందించిందని చెప్పారు. మృతి చెందిన ఉద్యోగుల నష్టపరిహారంపై రెండు రోజుల క్రితం ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్; రైల్వే మంత్రి పీయూష్ గోయెల్‌కు లేఖ రాసింది. ఫ్రంట్‌లైన్ వర్కర్ల మాదిరిగానే రైల్వే వర్కర్లకు రూ.25 లక్షలు కాకుండా రూ.50 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేసింది. ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శివగోపాల్ మిశ్రా ఆ లేఖలో వైరస్‌తో దాదాపు లక్షమందికి మించి బాధితులయ్యారని, వీరిలో 65 వేల మంది కోలుకుని విధులకు చేరారని చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News