Thursday, May 16, 2024

అంటువ్యాధిగా బ్లాక్ ఫంగస్

- Advertisement -
- Advertisement -

Rajasthan Govt declared Black Fungus as an Infectious Disease

రాజస్థాన్ ప్రభుత్వ ప్రకటన

జైపూర్: కొవిడ్-19 నుంచి కోలుకుంటున్న వారిపై ప్రధానంగా దాడి చేస్తున్న బ్లాక్ ఫంగస్‌ను(మ్యూకోమైకోసిస్) అంటువ్యాధిగా రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 100 మంది బ్లాక్ ఫంగస్ రోగులున్నారని, వారి చికిత్స నిమిత్తం జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ ఆసుపత్రిలో విడిగా ఒక వార్డును ఏర్పాటు చేశామని అధికారులు బుధవారం తెలిపారు. రాజస్థాన్ అంటువ్యాధుల నివారణ చట్టం 2020 కింద రాష్ట్రంలో మ్యూకోమైకోసిస్‌ని అంటువ్యాధిగా ప్రకటించినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ ఆరోగ్య కార్యదర్శి అఖిల్ అరోరా తెలిపారు. వ్యాక్ ఫంగస్, కరోనా వైరస్‌కు సమన్వయంతో చికిత్స అందచేసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. మధుమేహ రోగులకు బ్లాక్ ఫంగస్ సోకే అవకాశాలు అధికంగా ఉన్నట్లు వైద్య నిపుణులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News