Friday, May 3, 2024

ఇకామర్స్‌పై ఎఫ్‌డిఐపై త్వరలో స్పష్టత

- Advertisement -
- Advertisement -
Govt to soon issue clarification on FDI in e-commerce
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడి

న్యూఢ్లిలీ : ఇకామర్స్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డిఐ)పై ప్రభుత్వం త్వరలో స్పష్టతనివ్వనుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇకామర్స్ కంపెనీలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయంటూ పరిశ్రమలో కొన్ని వర్గాల నుంచి ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో మంత్రి ఈవిధంగా స్పందించారు. పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం(డిపిఐఐటి) త్వరలో దీనికి సంబంధించిన నిబంధనలు, స్పష్టతనివ్వనుందని ఆయన వివరించారు. మరోవైపు పోటీ వ్యతిరేక ప్రవర్తన ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లపై సిసిఐ (కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా) మళ్లీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ ప్లాట్‌ఫామ్‌లపై ఎంపిక చేసిన అమ్మకందారులను ప్రోత్సహించాయని, అధిక తగ్గింపులు పోటీని అణచివేసాయని ఫిర్యాదులు వచ్చాయి.

ఈ ఫిర్యాదు ఆధారంగా గత ఏడాది జనవరిలో సిసిఐ దర్యాప్తు ప్రారంభించింది. అయితే కంపెనీలు ఎలాంటి తప్పు చేయలేదంటూ ఖండించాయి. అయితే దీనిపై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు అప్పీల్ చేశాయి. డిజిటల్ సంస్థలకు సంబంధించిన విషయాలపై సిసిఐ ఎక్కువగా దృష్టి పెట్టింది. ఎందుకంటే ఇవి ఆర్థిక వ్యవస్థ, భారతీయ స్టార్టప్‌లపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. స్మార్ట్ టీవీ మార్కెట్లో గూగుల్ తన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ స్థానాన్ని దుర్వినియోగం చేసిందనే ఆరోపణలు ఉండగా, దీనిపై గత ఏడాది సిసిఐ విచారణ ప్రారంభించింది. దీనిని త్వరలో యాంటీట్రస్ట్ దర్యాప్తునకు ఆదేశించే అవకాశముంది. గూగుల్‌కు వ్యతిరేకంగా ఇటువంటి దర్యాప్తు మూడోది అవుతుంది. దీనిలో గూగుల్ ఇప్పటికే ఆండ్రాయిడ్‌కు సంబంధించిన కేసులతో పాటు దాని పేమెంట్ యాప్‌తో ముడిపడి ఉంది. ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్, మేక్‌మైట్రిప్ గోప్యతా విధానాలను మార్పుపై సిసిఐ పరిశోధన చేపట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News