Tuesday, April 30, 2024

ఎపిలో కర్ఫ్యూ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: కోవిడ్‌ నియంత్రణ చర్యలను కఠినంగా అమలు చేయాలని ఎపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  మాస్క్‌ ధరించకపోతే రూ.100ల జరిమానా కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. దుకాణాల్లో కూడా సిబ్బంది దగ్గర నుంచి వినియోగదారులకు వరకూ మాస్క్‌లు ధరించాల్సిందేనని స్పష్టం చేశారు.

ఉల్లంఘనలకు పాల్పడితే దుకాణాలకు అధికారులు భారీ జరిమానాలు విధించాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే 2–3 రోజులు దుకాణాలు మూసివేయాలని జగన్ సూచించారు. ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఎవరైనా ఫొటో తీసి పంపినా జరిమానాలు విధించాలన్నారు. దీనికోసం ప్రత్యేక వాట్సాప్‌ నంబర్‌ ఏర్పాటు చేయడంతో పాటు  రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌ కఠినంగా అమలు చేయాలన్నారు. ప్రజలెవ్వరూ గుమిగూడకుండా కఠిన ఆంక్షలు అమలులోకి రావాలని, మార్కెట్లు, తదితర చోట్ల కూడా మాస్క్‌లు ధరించాలంటూ మార్కెట్‌ కమిటీలు ఆదేశాలు జారీ చేయాలన్నారు.

అన్నిజిల్లాల్లో ఒకేలా కర్ఫ్యూ సడలింపులు ఉదయం 6 గంటలనుంచి రాత్రి 9 గంటలవరకూ ఉండాలని,  రాత్రి 9 గంటల తరువాత దుకాణాల మూసివేయాలని 10 గంటల తర్వాత కర్ఫ్యూ ఆంక్షలు అమల్లోకి రావాలన్నారు.  రాత్రి 10 గంటలనుంచి ఉదయం 6 గంటలవరకూ కర్ఫ్యూ అమలులో ఉంటుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News