Home చిన్న సినిమాలు అజ‌య్ దేవ‌గ‌న్ ‘భుజ్’ ట్రైల‌ర్ రిలీజ్..

అజ‌య్ దేవ‌గ‌న్ ‘భుజ్’ ట్రైల‌ర్ రిలీజ్..

Ajay Devgan's BHUJ Movie Trailer Released

ముంబై: బాలీవు్ స్టార్ హీరో అజ‌య్ దేవ‌గ‌న్ నటిస్తున్న తాజా చిత్రం ‘భుజ్’. ‘ద ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అనేది హ్యాష్ ట్యాగ్ పెట్టారు. ఈ సినిమాను 1971లో గుజ‌రాత్‌లోని బుజ్ వైమానిక స్థావ‌రంపై పాకిస్థాన్ వైమానిక ద‌ళాలు అక‌స్మాత్తుగా దాడి చేసిన కథ ఆధారంగా భారీ స్థాయిలో తెరకెక్కించారు. తాజాగా మూవీ ట్రైల‌ర్‌ను చిత్రయూనిట్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. దేశ‌భ‌క్తి, భారీ యాక్ష‌న్ స‌న్నివేశాల‌తోపాటు ఎమోషన్స్ ప్రేక్షకుల మనసును తాకెట్టుగా రూపొందించిన ట్రైల‌ర్‌పై భారీ అంచనాలను పెంచేసింది. ఈ సినిమాకు అభిషేక్ దుద‌య్యా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో అజయ్ దేవ‌గ‌న్ తోపాటు సంజ‌య్ ద‌త్,  సోనాక్షి సిన్హా, ప్రణిత తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఆగ‌స్టు 13వ తేదీన డిస్నీ హాట్‌స్టార్‌లో ఈ సినిమాను విడుదల కానుంది.

Ajay Devgan’s BHUJ Movie Trailer Released