- Advertisement -
జ్ఞానవేల్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న చిత్రానికి ‘జై భీమ్’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని శుక్రవారం సూర్య బర్త్‌డే సందర్భంగా విడుదల చేశారు. ఇందులో లాయర్ గెటప్‌లో సూర్య కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో గిరిజనుల హక్కులు, వారి సమస్యలపై పోరాడే పవర్ఫుల్ అడ్వకేట్‌గా సూర్య నటిస్తున్నారని తెలిసింది. ఈ చిత్రంలో రజిషా విజయన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సూర్యనే స్వయంగా నిర్మిస్తున్నారు.
- Advertisement -