Tuesday, May 7, 2024

త్వరలో సుమంత్ పెళ్లి?

- Advertisement -
- Advertisement -

హీరో సుమంత్ రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఆయన పవిత్ర అనే అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడు. త్వరలోనే వీరి మ్యారేజ్ జరుగబోతుందని సమాచారం. తాజాగా సుమంత్ వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వెడ్డింగ్ కార్డ్‌లో సుమంత్ కుమార్ వెడ్స్ పవిత్ర అని ఉంది. ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వెడ్డింగ్ కార్డ్ సిద్ధమైందంటే ఎంగేజ్‌మెంట్ కూడా పూర్తయిందని అర్థమవుతోంది. సీక్రెట్‌గా ఈ వ్యవహారాలను పూర్తి చేసినట్టు సమాచారం. అయితే ఇప్పటికే సుమంత్‌కి హీరోయిన్ కీర్తిరెడ్డితో వివాహం జరిగింది. 2004లో వీరి మ్యారేజ్ జరగగా, 2006లోనే విడిపోయారు. ఇద్దరి మధ్య మనస్పర్థాలు తలెత్తడంతో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. దాదాపు 15 ఏళ్లుగా ఒంటరిగానే ఉన్నాడు సుమంత్. ఎట్టకేలకు ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమయ్యాడట. అయితే ఇప్పుడు తాను చేసుకునే అమ్మాయి పవిత్ర తన బంధువుల కూతురని తెలిసింది. అదే సమయంలో లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ అనే వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇరు కుటుంబ పెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరుగనుంది.

Actor Sumanth to get engaged Pavithra?

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News