Saturday, April 27, 2024

ప్రిక్వార్ట‌ర్స్‌లో పివి సింధు

- Advertisement -
- Advertisement -

PV Sindhu enters in Olympics pre quarter

 

టోక్యో: ఇండియ‌న్ బ్యాడ్మింటన్ క్రీడాకారిని పివి సింధు ఒలింపిక్స్ ప్రిక్వార్ట‌ర్స్‌లోకి దూసుకెల్లింది. ప్రిక్వార్ట‌ర్స్‌లో బ్లిచ్ ఫెల్ట్ తో తలపడనుంది. బుధ‌వారం జ‌రిగిన గ్రూప్ జే రెండో మ్యాచ్‌లోనూ ఆమె విజ‌యం సాధించింది. హాంకాంగ్‌కు చెందిన ఎన్‌గ‌న్ యితో జరిగిన మ్యాచ్‌లో 21-9, 21-16 తేడాతో వ‌రుస గేమ్స్‌లో గెలిచింది. తొలి గేమ్‌ను 15 నిమిషాల్లోనే సునాయాసంగా సొంతం చేసుకున్న సింధుకు రెండో గేమ్‌లో ప్ర‌త్యర్థి నుంచి ప్ర‌తిఘ‌ట‌న ఎదురైంది. 14 పాయింట్ల వ‌ర‌కూ ఇద్ద‌రూ హోరాహోరీగా త‌ల‌ప‌డ్డారు. అయితే ఆ త‌ర్వాత పుంజుకున్న సింధు వ‌రుస‌గా పాయింట్లు సాధించింది. దీంతో గ్రూప్ జే టాప‌ర్‌గా ప్రిక్వార్ట‌ర్స్‌లో అడుగుపెట్టింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News