Tuesday, April 30, 2024

గోగ్రా, హాట్ స్ప్రింగ్స్‌లో నిస్సైనికీకరణపై భారత్, చైనా మధ్య 12వ విడత చర్చలు

- Advertisement -
- Advertisement -

12th round of India-China military talks

న్యూఢిల్లీ: తూర్పు లడఖ్‌లో 14 మాసాలుగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులకు ముగింపు పలికేందుకు కొన్ని కీలక ప్రదేశాలలో నిస్సైనికీకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా భారత్, చైనా శనివారం మరో విడత ఉన్నతస్థాయి సైనిక స్థాయి చర్చలను చేపట్టాయి. వాస్తవాధీన రేఖ వద్ద చైనా భూభాగంలోని మోల్డో సరిహద్దు పాయింట్ వద్ద 12వ విడత కోర్ కమాండర్ స్థాయి చర్చలు జరుగుతున్నట్లు సైనిక వర్గాలు తెలిపాయి. హాట్ స్ప్రింగ్స్, గోగ్రాలో నిస్సైనికీకరణ ప్రక్రియకు సంబంధించి సానుకూల ఫలితాలు వస్తాయని భారత్ ఆశాభావంతో ఉన్నట్లు వర్గాలు తెలిపాయి. దాదాపు మూడున్నర నెలల విరామం తర్వాత భారత్, చైనా మధ్య సైనిక స్థాయి చర్చలు జరుగుతున్నాయి. చివరిగా, 11వ విడత చర్చలు ఏప్రిల్ 9న వాస్తవాధీన రేఖ వద్ద భారత భూభాగంలోని చుషూల్ సరిహద్దు పాయింట్ వద్ద జరిగాయి. ఇవి దాదాపు 13 గంటల పాటు జరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News