Wednesday, May 1, 2024

పామును మింగిన పాతబస్తీ యువకుడు (వీడియో)

- Advertisement -
- Advertisement -
hyderabad Man eats Live Snake
పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ

హైదరాబాద్: బతికున్న పాము పిల్లను తింటూ వీడియోను ఓ యువకుడు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో గురువారం వైరల్‌గా మారింది. బతికున్న పామును తిన్న యువకుడిపై చర్యలు తీసుకోవాలని ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ సభ్యులు ట్విట్టర్ ద్వారా డిజిపి, నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. నగరంలోని పాతబస్తీకి చెందిన యువకుడు సాజిద్ పామును తింటూ వీడియో తీసుకున్నాడు. పామును తింటుండగా గిలగిలా కొట్టుకుంది. పామును మింగిన తర్వాత మంచినీళ్లు తీసుకుని రావాలని స్నేహితుడిని కోరాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే స్పందించి లొకేషన్, ఏరియా వివరాలు పంపించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News