Tuesday, April 30, 2024

పిల్లి పోయిందని పోలీసులకు ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -
complaint lodged in police station for cat missing
పిల్లలు బెంగపెట్టుకున్నారని ఆవేదన

హైదరాబాద్: అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిల్లిని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారని, పిల్లి కనిపించకపోవడంతో పిల్లలు బెంగపెట్టుకున్నారని రామచంద్రారెడ్డి యాదగిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లికి చెందిన గుజ్జుల రామచంద్రారెడ్డి ఏడు నెలలుగా ఓ పిల్లిని పెంచుకుంటున్నాడు. దానికి జిమ్మిగా పేరు పెట్టి అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు. సెప్టెంబరు 29వ తేదీన పిల్లిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారని, దీంతో వృద్ధురాలైన తల్లి గాలమ్మతోపాటు సోదరుడి కుమారులు జశ్వంత్‌రెడ్డి, తనీష్‌రెడ్డి బెంగపెట్టుకున్నారని రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తంచేశాడు. పిల్లి కనిపించకుండా పోయిన నాటి నుంచి మూడు రోజులుగా నిద్రాహారాలు మానివేశారన్నారని తెలిపారు. గ్రామంలోని ఏ ఇంట్లో వెతికినా పిల్లి ఆచూకీ లభించలేదని, వెంటనే తమ పిల్లి ఆచూకీ తెలపాలని రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడి కుమారులు యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News