Monday, May 6, 2024

రష్యాలో రికార్డు స్థాయిలో రోజువారీ కోవిడ్ మరణాలు

- Advertisement -
- Advertisement -

Russia covid

మాస్కో: రష్యాలో శుక్రవారం రికార్డు స్థాయిలో కోవిడ్-19 మరణాలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం రష్యా పాక్షిక లాక్‌డౌన్, ఇతర ఆంక్షల మధ్య నలుగుతోంది. కోవిడ్ ఉపద్రవాన్ని నివారించడానికి అన్ని ప్రత్యామ్నాయలు అనుసరిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 37140 కేసులు వ్యాప్తి చెందగా, 1064 మరణాలు సంభవించాయి. మరణాలు 24 గంటల్లోనే రెట్టింపు అయ్యాయి. గత నెల రోజుల్లో కోవిడ్ మరణాల సంఖ్య గరిష్ఠాన్ని నమోదుచేసింది. రోజువారి కోవిడ్ మరణాల్లో అమెరికా తర్వాత రష్యాదే రెండో స్థానంలో ఉంది. కరోనా మహమ్మారి వ్యాపించాక రష్యాలో ఇప్పటి వరకు 660000 మరణాలు సంభవించాయి. ‘ద మాస్కో టైమ్స్’ ఈ వివరాలు ఇచ్చింది. 80.1 మిలియన్ వ్యాధిగ్రస్తులతో రష్యా ప్రపంచంలో అత్యధిక ఐదో స్థానంలో ఉంది. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 7 వరకు నాన్-వర్కింగ్ వారంగా ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ ప్రకటించారు. కరోనా కేసులు తగ్గకపోతే పబ్లిక్ సెలవులను విస్తరించాలని కూడా ప్రాంతీయ నాయకులను కోరారు.
కరోనాలో ఉపరకం అయిన ఎవై 4.2 రకం రష్యాలో తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇది డెల్టా వేరియంట్ కంటే వేగంగా విస్తరిస్తోంది. ఈ విషయాని ఆ దేశానికి చెందిన ఓ సీనియర్ పరిశోధకుడు తెలిపారు. ఇదిలావుండగా ఈ ఎవై 4.2 ఉపరకం ప్రభావం బ్రిటన్‌లోనూ కనిపిస్తోంది. భారత్‌లో రెండో వేవ్‌లో డేల్టా వేరియంట్ మృత్యు ఘంటికలు మోగించిందన్నది తెలిసిన విషయమే. అంతిమ సంస్కారాలు నిర్వహించడం కూడా కష్టమైపోయిందప్పుడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News