Monday, May 6, 2024

దక్షిణ మధ్య రైల్వేలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

నవంబర్ 01వ తేదీ వరకు జోన్‌లో వివిధ కార్యక్రమాలు

Vigilance Awareness Week begins on South Central Railway

మనతెలంగాణ/హైదరాబాద్:  దక్షిణ మధ్య రైల్వేలో మంగళవారం నుంచి నవంబర్ 01వ తేదీ వరకు విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే అడిషినల్ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ మంగళవారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో అధికారులు, సిబ్బందితో ‘ప్రజా జీవితంలో అన్ని రంగాల్లో అవినీతిని నిర్మూలించడానికి కట్టుబడి ఉన్నాం’ అనే లక్ష్యంగా సమగ్రతా ప్రతిజ్ఞ చేయించారు. వివిధ విభాగాల అధిపతులు, ఇతర సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జోన్‌లోని ఆరు డివిజన్‌లలోని డివిజనల్ రైల్వే మేనేజర్లు, అధికారులు, సిబ్బందితో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాల సందర్భంగా వారం మొత్తం పోస్టర్లతో పాటు ప్రచార కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు బహిరంగ ప్రదేశాల్లో, క్షేత్రస్థాయిల్లో సిబ్బందితో పరస్పర సంబంధాలు కలిగుండే వారికి విజిలెన్స్ విభాగం అధికారులు ప్రత్యేక కౌన్సెలింగ్ ద్వారా అవినీతి వ్యతిరేకతపై అవగాహన కలిగిస్తారు. ఈ వారమంతా దక్షిణ మధ్య రైల్వే సిబ్బందికి అవగాహన కలిగించడం కోసం సెమినార్లు/వర్క్‌షాపులు/విజ్ఞాన కార్యక్రమాలతో సహా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. ఈనెల 31వ తేదీన సికింద్రాబాద్‌లోని రైల్వే స్పోర్ట్ కాంప్లెక్స్ వద్ద పాదయాత్ర కూడా నిర్వహించనున్నారు. ఈ వారోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీన వర్చువల్ సమావేశ కార్యక్రమం నిర్వహించనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. విజిలెన్స్/సాధారణ ఫిర్యాదులకు సంబంధించిన పలు అంశాలపై అవగాహన కలిగించేందుకు 1 నవంబర్ 2021 తేదీన కాంట్రాక్టర్లు/విక్రేతలు, వినియోగదారులు పాల్గొనే వర్చువల్ సమావేశంతో విజిలెన్స్ అవగాహన వారోత్సవాల కార్యక్రమాలు ముగుస్తాయని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News