Thursday, May 16, 2024

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు

- Advertisement -
- Advertisement -

Two arrested for selling marijuana

26కిలోల గంజాయి, రూ.2.60లక్షల నగదు స్వాధీనం

మనతెలంగాణ, హైదరాబాద్ : గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్, జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 26 కిలోల గంజాయి, రూ.2.60లక్షల నగదు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…ఎపిలోని విశాఖపట్టనం జిల్లా, అనకపల్లికి చెందిన వాకాడ మధు నగరంలోని యూసుఫ్‌గూడలోని యాదగిరి నగర్‌లో ఉంటున్నాడు. ఎపిలోని విశాఖకు చెందిన బాసనబోయిన యుగంధర్ నగరంలోని యాదగిరి నగర్‌లో ఉంటూ లైటింగ్, డెకరేషన్ పనిచేస్తున్నాడు. ఎపిలోని ఉన్న ఇద్దరు నగరానికి వచ్చి సినిమీ షుటింగ్‌లో లైట్‌మెన్‌గా పనిచేస్తున్నారు. ఇందులో వచ్చే డబ్బులు ఇద్దరికి సరిపోకపోవడంతో గంజాయి విక్రయించి డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశారు.

ఇందులో భాగంగా ధూల్‌పేటను ఇద్దరు కలిసి సందర్శించి వారికి ప్లాన్‌ను వివరించారు. విశాఖ నుంచి గంజాయి తీసుకుని వస్తామని చెప్పారు. కొనుగోలు చేసేందుకు వారు అంగీకరించారు. ఈ క్రమంలోని వాకాడ మధన్ ఏజెన్సీ ఏరియా నుంచి 26కిలోల గంజాయిని ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టులో తీసుకుని వచ్చాడు. ఇక్కడ అవసరం ఉన్న వారికి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు కోసం జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇన్స్‌స్పెక్టర్ నాగేశ్వరరావు, ఎస్సై పరమేశ్వర్, అశోక్‌రెడ్డి తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News