Friday, May 3, 2024

కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ ఇకలేరు!

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ (46) గుండెపోటుతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కాలధర్మం చెందారు. ఆయన జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నప్పుడు గుండెపోటుకు గురయ్యారు. తర్వాత ఆయన్ని ఆసుపత్రికి చేర్చారు. కానీ ఆయన గుండెపోటు నుంచి కోలుకోలేకపోయారు. అనేక మంది నిపుణులను రిప్పించినప్పటికీ ఏదీ పనిచేయలేదు. కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ ఎస్ బొమ్మై విక్రమ్ ఆసుపత్రికి వచ్చి పునీత్ ఆరోగ్య పరిస్థితి గురించి కనుకున్నారు కూడా. పునీత్ రాజ్‌కుమార్ కన్నడ సూపర్ స్టార్, కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ కుమారుడు. ఆయన బాల నటుడిగా 1985లోనే ‘బెట్టాడు హూవీ’సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. ఉత్తమ బాల నటుడిగా కూడా నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకున్నారు. ఆయన కాలధర్మం ఆయన కుటుంబానికి, అభిమానులకు, కన్నడ చిత్ర రంగానికి తీరని లోటనే చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News