Monday, May 6, 2024

ఎసిబికి చిక్కిన ట్రాన్స్‌కో ఎఇ

- Advertisement -
- Advertisement -

Transco AE arrested by ACB

 

మనతెలంగాణ/మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్‌పూర్ రూరల్ ఏఈ రాజ్ కుమార్ శనివారం లంచం తీసుకుంటు ఏసిబికి పట్టుబడ్డాడు. వరంగల్ ఏసిబి డిఎస్‌పి మధుసుదన్ తెలిపిన వివరాల ప్రకారం ఆరెంద గ్రామానికి చెందిన శౌకత్ అలీ తనకు ట్రాన్స్ ఫారం కావాలని 2020లో దరకాస్తు చేసుకోగా తనకు 20 వేలు చెల్లించి ట్రాన్స్ ఫార్మర్ తీసుకు పోవాలి చెప్పడంతో బాధితుడు తమను సంప్రదించాడని తెలిపాడు. బాధితుడి వద్ద నుంచి 20 వేలు తీసుకుంటుండగా తాము పట్టుకున్నామని తెలిపారు. నోట్లపై లిక్విడ్ న్ పరిశీలించామని పాజిటివ్‌గానే వచ్చిందని డిఎస్‌పి పేర్కొన్నాడు. బాధితుడు మంథని మండలం ఆరెంద గ్రామానికి చెందిన ఎండి శౌకత్ అలీ (మాజీ నక్సలైట్) గతంలో లోంగిపోయిన సమయంలో ప్రభుత్వం వారికి ప్రభుత్వ భూమి ని ఇవ్వడం జరిగింది.

శౌకత్ అలీ తోపాటు అతడి తమ్ముడి భూమి ఇరువురిది 5ఎకరాలు ఉండటంతో వారు ట్రాన్స్ ఫారం కొరకు 2020లో దరఖాస్తు పెట్టుకున్నారు. దీంతో ట్రాన్స్‌ఫారం సాంక్షన్ అయ్యిందని మీరు ఏఈని కలవాలని లైన్‌మెన్ దాసరి శ్రీనివాస్ చెప్పడంతో శౌకత్ అలీ గత నెలలో ఏఈని కలవడంతో ట్రాన్స్ ఫ్రార్మర్ తీసుకువెళ్లాలంటే అందరికి 30 వేల రుపాయలు తీసుకుంటున్నాని నీవు మాత్రం 25 వేలు ఇవ్వాలని ఏఈ డిమాండ్ చేశాడని ఏమైన తగ్గించాలని మరోసారి కలసి అడగడంతో చివరకు 20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడని బాదితుడు శౌకత్ అలీ తెలిపాడు. దీంతో తాను ఏసిబిని ఆశ్రయించానని బాదితుడు తెలిపాడు. ట్రాన్స్‌కో ఏఈని పట్టుకున్నవారిలో డిఎస్‌పితో పాటు ఏసిబి సిఐలు రాము, రవీంధర్, క్రాంతిలు ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News