Friday, May 17, 2024

కొవాగ్జిన్‌కు బ్రిటన్ గుర్తింపు

- Advertisement -
- Advertisement -

Covaxin is Now Approved in UK

లండన్: అంతర్జాతీయ ప్రయాణికుల కోసం గుర్తించిన కొవిడ్ టీకాల జాబితాలో భారత్‌కు చెందిన కొవాగ్జిన్‌ను చేర్చుతున్నట్టు బ్రిటన్ ప్రకటించింది. నవంబర్ 22 నుంచి ఈ టీకా తీసుకున్నవారు బ్రిటన్‌కు చేరుకున్న తరువాత ఐసొలేషన్‌లో ఉండాల్సిన అవసరం లేదు. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ను ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ) అత్యవసర వినియోగ జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. బ్రిటన్ ప్రభుత్వం ఇదివరకే కొవిషీల్డ్‌ను గుర్తించింది. నవంబర్ 22 నుంచి కొవాగ్జిన్‌తో సహా డబ్లుహెచ్‌వొ అత్యవసర వినియోగానికి గుర్తించిన టీకాలు వేసుకుని భారతీయులు ఎవరైనా ఇక్కడికి చేరుకున్నాక ఐసొలేషన్‌లో ఉండాల్సిన అవసరం లేదని బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎలిస్ ట్వీట్ చేశారు. ఈ కొత్త నిబంధనలు నవంబర్ 22 తెల్లవారు జామున 4 గంటల నుంచి అమలు లోకి వస్తాయి. కొవాగ్జిన్‌తోపాటు చైనాకు చెందిన సినోవాక్, సినోఫార్మ్‌లను కూడా బ్రిటన్ గుర్తించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News