Thursday, May 9, 2024

గంజాయి పట్టుకున్న మేడిపల్లి పోలీసులు

- Advertisement -
- Advertisement -

Madipalli police seize marijuana

ఆరు కిలోలు స్వాధీనం

బోడుప్పల్: గంజాయి విక్రయిస్తున్న యువకుడిని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ఆరు కిలోల గంజాయి, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై రఘురాముడు కథనం ప్రకారం…. చెంగిచెర్లకు చెందిన ముడావత్ గణేష్ అలియాస్ ఘనీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ముడావత్ కృష్ణ వెల్డింగ్ వర్క్ చేస్తున్నాడు. ఇద్దరు కలిసి గంజాయి విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి ఆరు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను చూసి గణేష్ పరార్‌కాగా, కృష్ణను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News