Tuesday, April 30, 2024

అత్యధిక థియేటర్లలో ‘ఆర్‌ఆర్‌ఆర్’..

- Advertisement -
- Advertisement -

రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’(ఆర్‌ఆర్‌ఆర్). ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. అలియా భట్, ఒలివియా మోరిస్‌లు హీరోయిన్లుగా.. అజయ్ దేవగణ్, శ్రియా శరణ్, సముద్ర ఖనిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 7న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని మొత్తం 10,000కి పైగా స్క్రీన్స్‌లో విడుదల చేయనున్నారని సమాచారం. యుఎస్‌లోనే 2,500కి పైగా స్క్రీన్‌లలో విడుదల కానున్నట్లు తెలిసింది. ఒకవేళ ఇదే నిజమైతే భారతీయ సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఎవర్ రిలీజ్‌గా ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ నిలిచే అవకాశం ఉంది.

RRR Movie to Release above 10k Theaters

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News