Monday, August 11, 2025

పర్యాటకుడిపై గజరాజు దాడి.. తృటిలో తప్పించుకున్నాడు..

- Advertisement -
- Advertisement -

బందీపూర్: సాధారణంగా అడవిలో నివసించే జంతువులకు కోపం వస్తే.. అవి ఎవరిపై ఎలా దాడి చేస్తాయో మనం ఊహించలేము. అలా అడవి జంతువుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు గతంలో ఎన్నో చూశాం. కొంతమంది మాత్రమే ఆ దాడుల నుంచి ప్రాణాలతో బయటపడతారు. అలాంటి పరిస్థితే.. కేరళకు చెందిన ఈ పర్యాటకుడికి ఎదురైంది. కేరళకు చెందిన ఓ పర్యాటకుడు కర్ణాటకలోని బందీపూర టైగర్ రిజర్వ్‌కి సందర్శన కోసం వచ్చాడు. ఆ సమయంలో ఓ గజరాజు (Elephant) ఆగ్రహంతో ఆ వ్యక్తిపై దాడికి ప్రయత్నించింది. అతను పారిపోతున్న వదలకుండా తరిమింది. ఆ తర్వాత అతను కిందపడటంతో కాలితో తొక్కింది. అదృష్టవశాత్తు ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. సెల్ఫీ కోసం ప్రయత్నిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News