హైదరాబాద్: పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిన ‘ఒజి’ (OG Movie) చిత్ర యూనిట్‌కి తెలంగాణ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. టికెట్ రేట్ల పెంపును రద్దు చేస్తూ సింగిల్ జిడ్జ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ శుక్రవారం వరకూ స్టే విధించింది. ఈ మూవీ ప్రీమియర్స్‌తో పాటు టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ అనుమతులను రద్దు చేయాలంటూ మహేశ్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్.. ప్రీమియర్ షోలు, టికెట్ ధరల పెంపును రద్దు చేస్తూ.. తీర్పు వెలువరించారు. తాజాగా ఈ తీర్పుపైనే డివిజన్ బెంచ్ స్టే విధించింది.
పవన్‌కళ్యాణ్ హీరోగా నటించిన ‘ఒజి’ (OG Movie) చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహించారు. ప్రియాంక మోహన్ హీరోయిన్గా, ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటించారు. ఈరోజు (గురువారం) విడుదలైన ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. తెలంగాణలో విడుదల రోజు నుంచి అక్టోబర్ 4 వరకు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100 (జిఎస్టితో కలిపి), మల్టీప్లెక్స్‌లో రూ.150 (జిఎస్టితో కలిసి) పెంచుకునేందుకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది.
Also Read : దసరాకు ‘మాస్ జాతర’ రిలీజ్ డేట్ అనౌన్స్…