- Advertisement -
నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ పవర్‌హౌస్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర. అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించే ఈ పాన్ -ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. అద్భుతమైన విజువల్స్, పౌరాణిక ఇతివృత్తాలతో తెరకెక్కుతున్న జటాధర నవంబర్ 7న గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. మేకర్స్ తాజాగా ఫస్ట్ ట్రాక్ ‘సోల్ ఆఫ్ జటాధార’ను విడుదల చేశారు. సాంప్రదాయ సంగీతం, ఆధ్యాత్మిక టచ్ కలిసిన ఈ స్వరాలు మనల్ని జటాధర ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. రాజీవ్ రాజ్ కంపోజ్ చేసి, స్వయంగా పాడిన ఈ ఆడియో గ్లింప్స్ అందరిని ఆకట్టుకుంది. జీ స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అర్ణు అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా నిర్మిస్తున్నారు.
- Advertisement -