Saturday, May 4, 2024

సింగపూర్‌లో నేడు భారత సంతతి వ్యక్తికి ఉరి

- Advertisement -
- Advertisement -

సింగపూర్: భారత సంతతికి చెందిన వ్యక్తికి సింగపూర్ అధికారులు నేడు ఉరిశిక్ష అమలుచేయనున్నారు. మాదక ద్రవ్యాల రవాణాకు సహకరించాడన్న ఆరోపణలు రుజువు అవడంతో బుధవారం మరణశిక్ష అమలు చేయనున్నట్లు స్థానిక మీడియా మంగళవారం తెలిపింది. తంగరాజు అక్టోబర్ 9, 2018లో న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. కిలోకిపైగా గంజాయిని రవాణా చేసేందుకు తంగరాజు ప్రయత్నించగా 2014లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్యపరీక్షల్లో తంగరాజు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. న్యాయస్థానం విధించిన మరణశిక్షను బుధవారం అమలుచేయనున్నట్లు న్యూస్ ఆసియా చానల్ నివేదించింది.

Also Read: భారత్ తొలిగ్రామం ‘మన’ సైన్‌బోర్డు ఏర్పాటు

కాగా సింగపూర్ హోం మంత్రిత్వశాఖ (ఎంహెచ్‌ఎ) మంగళవారం బ్రిటిష్ బిలియనీర్ రిచర్డ్‌బ్రాన్సన్ బ్లాగ్ పోస్టుపై తీవ్రంగా స్పందించింది. బ్రాన్సన్ తంగరాజు శిక్షపై నిరసన వ్యక్తం చేసి తమ దేశ న్యాయమూర్తులను, న్యాయ విధానాన్ని అవమానపరుస్తున్నట్లు తెలిపింది. డ్రగ్స్ కేసులో దోషులకు ఉరిశిక్ష విధించడంపై నిర్వహించిన సర్వేలో 87శాతం ప్రజలు తమ ఆమోదాన్ని తెలిపారని, తీవ్రమైన నేరాలకు పాల్పడినవారికి మరణశిక్షను కేవలం సింగపూర్‌లోనే కాదని ప్రపంచంలోనే అతిపెద్ద మూడు దేశాలు చైనా, భారత్, అమెరికా కూడా అమలుచేస్తున్నట్లు సింగపూర్ హోం మంత్రి కే షణ్ముగం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News