Friday, April 26, 2024

గృహ రుణాల రేట్లను పెంచేసిన పలు బ్యాంకులు

- Advertisement -
- Advertisement -

Home Loan

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంక్ లు ఎస్ బిఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలపై రేట్లను పెంచేశాయి. గత వారం ఆర్బీఐ కీలక రెపో రేటును అర శాతం పెంచడం తెలిసిందే. దీంతో బ్యాంకు లు సైతం వెంటనే రుణాలపై రేట్లను సవరించేశాయి. ఎస్ బిఐ అయితే అర శాతం పెంచింది. ఎక్స్ టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేటు (ఈబిఎల్ఆర్), రెపో లింక్డ్ లెండింగ్ రేటును అరశాతం పెంచింది. దీంతో ఎక్స్ టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేటు 8.55 శాతానికి, రెపో లింక్డ్ లెండింగ్ రేటు 8.15 శాతానికి చేరింది.

బ్యాంక్ ఆఫ్ బరోడా రెపో లింక్డ్ లెండింగ్ రేటును సవరించింది. 8.45 శాతం చేసింది. అంటే గృహ రుణాలపై  ఈ రేటు అమలు కానుంది. ఇందులో ప్రస్తుత రెపో రేటు 5.90 శాతానికి,  మార్క్ అప్,  బేస్ స్ప్రెడ్  పేరుతో మరో 2.55 శాతం కలసి ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో లింక్డ్ బెంచ్ మార్క్ లెండింగ్ రేటు 8.75 శాతానికి పెరిగింది. ఇవే కాకుండా పలు ప్రైవేటు రంగ బ్యాంకులు, ఎన్ బిఎఫ్ సిలు కూడా రేట్లను సవరించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News