Saturday, May 4, 2024

దక్షిణాదిలో విస్తరించాలనుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ

- Advertisement -
- Advertisement -

Kejriwal to Telangana

న్యూఢిల్లీ: పంజాబ్‌లో ఊహించని స్థాయిలో విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఇప్పుడు ఇతర రాష్ట్రాలపై దృష్టి పెట్టింది. ఈ ఏడాది చివర్లో జరుగనున్న గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడేందుకు సమాయత్తం అవుతోంది. అంతేకాకుండా దక్షిణాదిలోనూ విస్తరించాలనుకుంటోంది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలంగాణకు వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. వచ్చే నెలలో (ఏప్రిల్) కేజ్రీవాల్ హైదరాబాద్ రానున్నట్లు ఆప్ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయన పాదయాత్ర చేయనున్నట్లు ఆప్ తెలంగాణ సెర్చ్ కమిటీ చైర్‌పర్సన్ ఇందిరా శోభన్ తెలిపారు. హైదరాబాద్‌లోనూ, తెలంగాణలోని ఇతర పట్టణ ప్రాంతాల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం ఉండగలదని ఆప్ చీఫ్ కేజ్రీవాల్ భావిస్తున్నారు. కాగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆప్ పాదయాత్ర చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
తెలంగాణలో వచ్చే ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలతోనే ఆమ్ ఆద్మీ పార్టీ దక్షిణాదిలో కూడా కాలూనాలని ప్రయత్నిస్తోంది. తెలంగాణలో ‘ఆమ్ ఆద్మీ పార్టీ ఇన్‌ఛార్జ్’గా సోమనాథ్ భారతిని నియమించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News