Tuesday, April 30, 2024

వినాయక చవితితో మెగా బ్రదర్స్ అనుబంధం

- Advertisement -
- Advertisement -

Acharya motion poster release on Chiranjeevi Birthday

టాలీవుడ్‌లో మెగా బ్రదర్స్ అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ల నడుమ ఉన్న బంధం ఎంత గట్టిదో అందరికీ తెలిసిందే. ఒకరి పట్ల ఒకరు ఎంత ప్రేమానురాగాలు కనబరుస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే ఈ ఇద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూస్తే మెగా ఫ్యాన్స్‌కు వచ్చే ఆనందమే వేరు. అలాంటిది ఇప్పుడు ఈ ఇద్దరు మెగా బ్రదర్స్ పుట్టినరోజు సందర్భంగా వారు నటిస్తున్న సినిమాలకు చెందిన ఎక్స్‌క్లూజివ్ అప్‌డేట్స్ వస్తుండడం ఒక స్పెషల్ అయితే మరో అంశం ఈ ఏడాది ఈ ఇద్దరి అన్నాదమ్ములను యాధృచ్చికంగా కలిపింది అని చెప్పాలి. గత ఏడాది చిరు తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2న వినాయక చవితి సందర్భంగా రాగా ఈ ఏడాది అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు శనివారం నాడు ఆగస్ట్టు 22న వినాయక చవితి సందర్భంగా వస్తోంది. వినాయక చవితి పండుగ ఈ ఇద్దరు మెగా బ్రదర్స్‌కు భలేగా కలిసొచ్చిందని అంటూ అభిమానులు ఒకటే ఖుషీ అయిపోతున్నారు. ఇక ఈ ఏడాది బర్త్ డే వేడుకల సందర్భంగా మెగా బ్రదర్స్ చిరు, పవన్ తమ సినిమాల ఫస్ట్ లుక్ లతో అలరించనున్నారు. శనివారం నాడు బర్త్ డే రోజున చిరు నటిస్తున్న ‘ఆచార్య’ మోషన్ టీజర్ రిలీజవుతుండగా.. సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డేకి ‘వకీల్ సాబ్’ కొత్త లుక్ టీజర్ రిలీజ్ కానుంది.

Acharya motion poster release on Chiranjeevi Birthday

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News