Friday, May 3, 2024

ముంబయ్‌లో శరవేగంగా…

- Advertisement -
- Advertisement -

saif ali khan adipurush latest update

ప్రభాస్ ఇటీవల బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ‘సలార్’తో పాటు ‘ఆదిపురుష్’ చిత్రాన్ని అతను చేస్తున్నాడు. కరోనా సెకండ్ వేవ్‌కి ముందు ముంబయ్‌లో ‘ఆదిపురుష్’ షెడ్యూల్ పూర్తి చేశారు. 30శాతం షూటింగ్ పూర్తయిందని దర్శకుడు ఓంరౌత్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆదిపురుష్ 3డి చిత్రం ఆగస్టు 2022లో విడుదల కానుంది. తాజా సమాచారం మేరకు ముంబయ్‌లో కొత్త షెడ్యూల్ ని ప్రారంభించి శరవేగంగా చిత్రీకరణను పూర్తి చేస్తున్నారు. ప్రభాస్ లేకుండానే రావణాసురుడు పాత్రధారి సైఫ్ అలీఖాన్‌పై కీలక సన్నివేశాల చిత్రీకరణ సాగుతోంది. దీనికోసం రావణలంక సెట్‌ని వేసి అక్కడే సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. రావణ పాత్రపై కీలక సన్నివేశాల్లో సైఫ్‌తో పాటు ప్రభాస్ చేరతాడా లేదా తెలియదు కానీ.. తదుపరి ప్రభాస్‌తోనూ షెడ్యూల్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ చిత్రంలో శ్రీరాముడిగా ప్రభాస్.. సీతాదేవిగా కృతి సనన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. లక్ష్మణుడి పాత్రలో సన్నీసింగ్ కనిపించనున్నాడు. ఆదిపురుష్ 3డిని భారతదేశంలో మునుపెన్నడూ చూడని ఒక విజువల్ వండర్ గా తీర్చిదిద్దాలని ఓంరౌత్ ఎంతో శ్రమిస్తున్నాడు.

Adipurush shooting is in full swing in Mumbai

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News