Wednesday, May 1, 2024

భవిష్యత్తు ఎంటర్‌టైన్‌మెంట్ గేమ్ ఛేంజర్

- Advertisement -
- Advertisement -

నేటి యువత ఆలోచనలు, అభిరుచికి అనుగుణంగా కొత్త కంటెంట్‌తో సినిమా రంగానికి ధీటుగా డిజిటల్ రంగం అభివృద్ధి చెందుతోంది. ఇప్పటి వరకు ఇతర భాషలకు చెందిన ఓటిటి ప్లాట్‌ఫామ్స్‌ను మాత్రమే చూశాం. కానీ తొలిసారి 100 శాతం పక్కా తెలుగు కంటెంట్‌ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది ‘ఆహా ఓటిటి’ ఫ్లాట్‌ఫామ్. ఆదివారం హైదరాబాద్‌లో ‘ఆహా ఓటిటి’ ప్రివ్యూ ఫంక్షన్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. “ఏడాది క్రితం ఇతర డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్ మన సినిమాలను తినేస్తాయేమో అనే భయంతో ‘ఆహా ఓటిటి’ ప్రయాణం మొదలైందని చెప్పవచ్చు. ఓసారి మై హోమ్ రామేశ్వర్ రావు, రామ్‌తో ఈ విషయం గురించి మాట్లాడితే.. వాళ్లు వెంటనే తమ మద్దతనిస్తూ భాగస్వామ్యులుగా మారారు.

ఉగాది రోజున ‘ఆహా ఓటిటి’ ఫ్లాట్‌ఫామ్‌ను లాంచ్ చేస్తాము”అని అన్నారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “ఆహా ఓటిటి… భవిష్యత్తు ఎంటర్‌టైన్‌మెంట్ గేమ్ ఛేంజర్ అని చెప్పొచ్చు. ఇప్పుడే ఒక లక్షయాప్స్ డౌన్‌లోడ్ అయ్యాయి. న్యూస్, కామెడీ షోస్, సినిమాలు… ఇలా అన్నీ ఒక్క బటన్‌తో ప్రేక్షకుల చేతికి వచ్చేస్తాయి”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాగర్లమూడి క్రిష్, నవదీప్, రాము రావు జూపల్లి పాల్గొన్నారు.

Aha OTT Platform Preview Event in Hyderabad

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News