Wednesday, May 8, 2024

ఏడాదికోసారి జిఎస్‌టి రేట్ల సమీక్ష

- Advertisement -
- Advertisement -

GST

 

కోల్‌కతా: ప్రభుత్వం నిరంతరంగా పరిశ్రమదారులు, వ్యాపారవేత్తలతో సమావేశం కావాలని, వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని కోరుకుంటోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ నెల 1వ తేదీన పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ సమర్పించిన వారం రోజుల తర్వాత ఆదివారం ఇక్కడ వ్యాపార, పారిశ్రామిక రంగాల ప్రతినిధులతో సమావేశమైనారు.‘ ప్రభుత్వం వాణిజ్య, పారిశ్రామిక వర్గాలతో సంప్రదింపులు కొనసాగించాలని కోరుకుంటోందన్నది బడ్జెట్ ఇస్తున్న స్థూల సందేశం.అందులో భాగంగానే నేనుఇక్కడికి వచ్చానే తప్ప దేశంలోపల, దేశం బయట ఏం జరుగుతున్నదన్న దానితో సంబంధం లేదు’ అని నిర్మలా సీతారామన్ అన్నారు. పన్నుల పాలనా యంత్రాంగంలో సంస్కరణలు తీసుకు రావడంతో పాటుగా పన్నులకు సంబంధించి సమస్యలను పరిష్కరించడం కోసం బడ్జెట్‌లో కొన్ని చర్యలను ప్రవేశపెట్టిందని ఆమె చెప్పారు.

అయితే కేవలం కొత్త టెక్నాలజీ సాయంతోనే ఈ చర్యలు సాధ్యమవుతాయని ఆమె చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతి సంవత్సరాల్లో పన్నుల శాఖలో పేరుకు పోయిన నిర్లిప్తత, ఉదాసీనతలను తొలగించామని, బడ్జెట్‌లో చేసిన హామీలను నెరవేర్చడానికి ఇది ప్రభుత్వానికి దోహదపడుతుందని ఆమె చెప్పారు. జిఎస్‌టి కి సంబంధించిన సమస్యల గురించి ప్రస్తావిస్తూ పన్ను రేట్ల తగ్గింపునకు చర్యలు తీసుకోవలసింది కేవలం కేంద్రం మాత్రమే కాదని, రాష్ట్రాల మంత్రులు కూడా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలని, అప్పుడే సమన్వయం సాధ్యమవుతుందని ఆర్థిక మంత్రి అన్నారు.

అంతే కాదు, ఇప్పుడు జరుగుతున్నట్లుగా ప్రతి మూడు నెలలకోసారి కాకుండా సంవత్సరానికోసారి జిఎస్‌టి రేట్లపై సమీక్ష జరిగితే బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. బడ్జెట్‌లో పశ్చిమ బెంగాల్‌కు ఏమిచ్చారని ఓ విలేఖరి ప్రశ్నించగా ‘ ఎవరికి ఏమి ఇచ్చారని చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదు’ అంటూ ఆమె సమాధానాన్ని దాటవేశారు. అసోంలోని తేయాకు తోటల ప్రాంతంలో తగినన్ని ఎటిఎంలు లేని విషయాన్ని తేయాకు బోర్డు చైర్మన్ పికె బెజ్‌బారువా మంత్రి దృష్టికి తీసుకు రాగా, ఎటిఎంలు తక్కువ ఉన్న మాట నిజమేనని, ఎటిఎంలు లేని చోట మరిన్ని ఎటిఎంలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆమె చెప్పారు.

Review of GST rates annually
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News