Saturday, May 4, 2024

‘చోర్ బజార్’లో ఆకాష్ పూరీ

- Advertisement -
- Advertisement -

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు యువ హీరో ఆకాష్ పూరీ తన మూడో చిత్రాన్ని ప్రారంభించాడు. ‘జార్జ్ రెడ్డి’ దర్శకుడు జీవన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఈ చిత్రానికి ‘చోర్ బజార్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దొంగిలించిన వస్తువులన్నీ చోర్ బజార్‌కు చేరుతుంటాయి. అయితే ఈ కథను అంతా ఊహించినట్లు కాకుండా విభిన్నంగా తెరకెక్కించనున్నారు దర్శకుడు. ‘చోర్ బజార్’ సినిమా గురువారం హైదరాబాద్‌లోని ప్రొడక్షన్ ఆఫీస్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. హీరో ఆకాశ్‌పై సోదరి పవిత్ర పూరి క్లాప్ ఇవ్వగా తల్లి లావణ్య కెమెరా స్విచ్చాన్ చేశారు. ఐవిఎస్‌ఎన్ రాజు ఫస్ట్ షాట్‌కు దర్శకత్వం వహించారు. బాలు మున్నంగి స్క్రిప్ట్‌ను అందించారు. వి ప్రొడక్షన్స్ పతాకంపై విఎస్ రాజు తన తొలి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో సుబ్బరాజు, పోసాని, ‘లేడీస్ టైలర్’ ఫేమ్ అర్చన ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈనెల 26 నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః జగదీష్ చీకటి, సంగీతంః సురేష్ బొబ్బిలి, ఎడిటింగ్‌ః సత్య గిడుటూరి, ఆర్ట్‌ః గాంధీ నడికుడికర్.

Akash Puri’s Chor Bazaar movie launch

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News