Monday, April 29, 2024

తలకిందులవుతున్న వంటింటి బడ్జెట్

- Advertisement -
- Advertisement -

Fuel price hike affects prices of vegetables

పెరిగిన పెట్రో ధరలతో అన్ని వస్తువులపై తీవ్ర ప్రభావం
పంట దిగుబడి పెరిగినా వినియోగదారులకు దక్కని ప్రయోజనం
ట్రాన్స్‌పోర్టు చార్జీల పేరుతో అదనపు భారం, పెరిగిన ధరలతో సామాన్యులకు తప్పని తిప్పలు

హైదరాబాద్: గత కొద్ది రోజులుగా వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యుని వంటింటి బడ్జెట్ తారుమారవుతోంది. ముఖ్యంగా వీటి ప్రభావం నిత్యావసర వస్తువులైన కూరగాయలు, పప్పుధాన్యాలపై పడుతుండటంతో సామాన్యుడిని నెలసరి వేతనం చేతికందకుండానే ఆవరవుతోంది. గత నెల రోజులకు తగ్గుముఖం పడుతున్న కూరగాయాలపై పడుతుండటంతో వాటి ధరలు భగ్గుమంటున్నా యి. నగరానికి వచ్చే కూరగాయల్లో అధిక శాతం పొరుగు జిల్లాల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్న సంగతి తెలిసిందే. సాధారణంగా సకాలంలో వర్షాలు పడి పంటలు దిగబడి కూడా అధికంగా ఉంది. దీంతో అన్ని రకాల కూరగాయలు, పప్పుదినుసుల ధరలు కూడా తగ్గుతాయి. కాని ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పంటలు దిగుమతి పెరిగినా పెట్రోల్, డీజిల్ చార్జీలు పెరగడంతో ట్రాన్స్‌పోర్టు కూడా పెరిగాయి. వాటి భారం నిత్యావసర వస్తువులపై పడటంతో సామాన్య వినియోగదారులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

ఉదాహరణకు వారం రోజుల క్రితం కిలో టమాట మార్కెట్లో రూ. 5 ఉండగా అది ప్రస్తుతం రూ.10 నుంచి 15 పలుకుతోంది. దీనిలో ట్రాన్స్‌పోర్టు చార్జీలు కూడా ఉండటంతో ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. వాటితో పాటు కంది పప్పుడు, వంట నూనెల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. నిన్న మొన్నటి వరకు కరోనా కారణంగా వేతనాల్లో కోత విధిండచంతో తాము అనేక ఇబ్బందులు పడ్డామని ఇప్పడిప్పుడే పరిస్థితులు సాధారణ పరిస్థితికి చేరుకుంటూ పూర్తి స్థాయిలో వేతనాలు అందకుంటామనే సంతోషాన్ని రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ఆవిరి చేస్తున్నాయి ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ధరలు పెరుగుతుంటే నగరం జీవనం చా లా కష్టంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా సమయంలో కూడా ఇంధన ధరల పెరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారం పడకుండా కొంత మేరకు ట్యాక్స్‌ను తగ్గించుకుని సామాన్య ప్రజలపై అదనపు భారం పడకుండా చేశాయని అదే పద్దతిని ఇప్పుడు కూడా పాటించాలని పలువురు కోరుతున్నారు.

అధిక పన్నులే కారణమా

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ఇంధనాలపై అనేక రకాలపై పన్నులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేయడమే ఇందుకు ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మన పొరుగున ఉన్న దేశాలైన నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో కూడా పెట్రోల్ ధరలు ఇంతగా లేవని నిపుణులు చెబుతున్నారు. పెట్రోల్ ధర లీటర్ రూ.90 ఉందనుకుంటే కేంద్రం ట్యాక్స్‌ల రూపంలో రూ. 33, రాష్ట్ర ప్రభుత్వం 21 వసూలు చేస్తున్నాయంటున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో లీటర్ పెట్రోల్ ( క్రూడాయిల్ ) ధర రూ.24 ఉండగా అన్ని రకాల చార్జీలతో కలిపి మన దేశంలో డీలర్ కమిషన్‌తో కలుపుకుని రూ.35 మాత్రమే అవుతుందని చెబుతున్నారు. మన దేశంతో పోలిస్తే అభివృద్ధిలో ఎంతో వెనుకడి ఉన్న వెనుజులా వంటి దేశాల్లో లీటర్ పెట్రోల్ అతి తక్కువగా ఉందని చెబుతున్నారు. పెట్రోల్, డీజిల్ ఇంధనాలను వ్యాట్ పరిధిలోకి తీసుకొస్తే సామాన్యుడిపై భారం పడకుండా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News