Saturday, April 27, 2024

‘ఏజెంట్’ యాక్షన్ షురూ

- Advertisement -
- Advertisement -

Akhil Stunning poster‌ from Agent

 

అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’. ఇక అఖిల్‌కు సంబంధించిన ఓ స్టన్నింగ్ పోస్టర్‌తో సినిమా షూటింగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ‘ఏజెంట్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైందని చిత్ర యూనిట్ ప్రకటించింది.“ది కిల్లర్ అఖిల్ అక్కినేని, స్టన్నర్ సురేందర్ రెడ్డి సూపర్ ఛార్జ్‌తో యాక్షన్ మొదలుపెట్టారు. మెటిక్యులస్ ప్లానింగ్, ఇంటెన్స్ ట్రైనింగ్ తరువాత మా ‘ఏజెంట్’ షూటింగ్ సోమవారం ప్రారంభమైంది” అని మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో అఖిల్ 8 ప్యాక్ బాడీని చూపించడంతో పాటుగా సినిమా నేపథ్యాన్ని గుర్తు చేస్తూ గన్‌ని చూపిస్తున్నాడు. ‘ఏజెంట్’ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తోంది. దీనికి వక్కంతం వంశీ కథ అందిస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సరెండర్ 2 సినిమా బ్యానర్స్‌పై భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర, – సురేందర్ రెడ్డి దీనికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News