Friday, April 26, 2024

‘పల్లా’వీస్తున్న రాగం

- Advertisement -
- Advertisement -

టిఆర్ ఎస్ అభ్యర్థ్ధి ‘పల్లా’కు రోజు రోజుకూ పెరుగుతున్న మద్దతు
టిఎన్‌జివో, టిజివో ఉద్యోగుల సంపూర్ణ మద్దతు
మైము సైతం అంటూ న్యాయవాదులు, డాక్టర్లు, వ్యాపారులు
పల్లాకు అండగా ముందుకు వచ్చిన పలు కుల సంఘాలు

All are support palla rajeswar reddy

మన తెలంగాణ/ఖమ్మం ప్రతినిధి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి రోజు రోజుకు మద్దతు పెరుగుతుంది. ఈనెల14న నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. మరో ఐదు రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపధ్యంలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ ఏడాది వేసవి ఎండలతో పాటు ప్రచారం కూడా వేడేక్కుతుంది. మూడు పూర్వ జిల్లాల పరిధిలోని 12 జిల్లాలో టిఆర్‌ఎస్ శ్రేణులు విస్తృత్తంగా ప్రచారం చేస్తున్నాయి. దీంతో అభ్యర్థ్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డికి రోజు రోజుకు బలం పెరుగడమేకాకుండా నామినేషన్ల దాఖలకు ముందు ఉన్న వాతవరణం ఇప్పుడు లేదని సానుకూల వాతవరణం ఏర్పడిందని గులాబీ నేతలు అంటున్నారు.

తెలంగాణలో దుబ్బాక, జిహెచ్‌ఎంసి ఎన్నికల తరువాత జరుగుతున్న పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ఇప్పుడు అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకన్నాయి. ప్రధానంగా అధికార టిఆర్‌ఎస్ పార్టీ ఈ ఎన్నికను చాలేంజ్‌గా తీసుకొని పనిచేస్తుంది. వరస ఓటమితో కసితో ఉన్న ఆ పార్టీ శ్రేణులు ఈ ఎన్నిక ద్వారా తిరిగి సత్తా చాటాలని గులాబీ శ్రేణులు తహతహలాడుతున్నారు. విద్యావంతుడు, ప్రైవేట్ విద్యా సంస్థల అధినేత అయిన సిట్టింగ్ ఎమ్మెల్సీ, రైతు బంధు చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ని మరోసారి ఎమ్మెల్సీ బరిలోకి దించారు.అయితే ప్రారంభంలో అతనిపైఒకింత అసంతృప్తి ఉన్నప్పటికి ఇప్పుడు అది పటాఫంచలయ్యింది. తెలంగాణ ఏర్పాటైన తరువాత రాష్ట్రంలో లక్షా31వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ బహిరంగ లేఖను విడుదల చేసి సవాల్ విసిరినప్పటికి ఇప్పటికి ఆ సవాల్‌ను ఎవ్వరూ స్వీకరించలేదు. ప్రభుత్వ పరంగానే కాకుండా ప్రయివేట్ రంగంలో కూడా 3లక్షలకుపైగా ఉద్యోగాలను కల్పించినట్లు లేక్కలతో సహ శ్వేతపత్రాన్ని విడుదల చేసి నిరుద్యోగుల పట్ల సానుకూల వాతవరణం కల్పించారు. ప్రశ్నించే గోంతుతో పని లేదని పని చేసే ప్రతినిధి కావాలనే నినాదంతో ఆయన పట్టభద్రుల్లో స్థానం సంపాదించుకున్నారు.

ప్రత్యర్థ్ధులు, విపక్షాలు చేసే విమర్శలను తిప్పికొట్టుతూ ఉద్యోగనియమకాలకు సంబంధించి పూర్తి వివరాలతో సమగ్ర సమాచారంతో బహిరంగ లేఖను విడుదల చేయడంతో ప్రత్యర్థ్ధుల నోరు మెదపడంలేదు. కాళేశ్వరం ఇతర ప్రాజెక్టుల ద్వారా తెలంగాణవచ్చిన తరువాత కొన్ని లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు ఇచ్చారు.ఇక లక్షల కోట్ల వ్యయంతో ప్రతి ఏట బడ్జెట్‌ను ప్రవేశ పెడుతూ అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధిని, సంక్షేమాన్ని సాధించామని టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థ్ధి పల్లా ఓటర్లకు వివరిస్తున్నారు. దీంతో ఆయనకు అనుకూల వాతవరణం ఏర్పడింది. దీంతో పట్టభద్రుల ఓటర్లలో సింహభాగంగా ఉండే ప్రభుత్వ ఉద్యోగులు బేషరత్తుగా పల్లాకు మద్దతు ప్రకటించారు. ఈమేరకు మూడు జిల్లాలో టిఎన్‌జివో,టిజివో అధికారుల సంఘం బహిరంగంగా ప్రకటన చేశాయి.

పల్లాకు మద్దతు ఇస్తున్నట్లు రాష్ట్ర టిఎన్‌జివో అధ్యక్షులు రాజేందర్ ఖమ్మం వేదిక మీదుగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, అభ్యర్థ్ధి పల్లా సమక్షంలోనే ప్రకటించారు. అదే విధంగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కూడా ప్రకటించింది. ఖమ్మం నగరంలో న్యాయవాదులు, డాక్టర్లు, గ్రానైట్ వ్యాపారులు, వర్తక సంఘం తదితర సంఘాలు పల్లాకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించాయి. అదేవిధంగా కుల సంఘాలు, ప్రైవేట్ ఉద్యోగులు, టీచర్లు కూడా మేమే సైతం అంటూ ముందుకు వచ్చి పల్లాకు సంఘీభావాన్ని ప్రకటించాయి. వెలమ, కమ్మ, బ్రాహ్మణ,ఆ ర్యవైశ్య, పద్మశాలి తదితర కుల సంఘాలు సైతం పల్లాకు తోడుగా ఉంటామని ప్రకటించాయి. 12జిల్లాల పరిధి లో 5,05,565 ఓటర్లు ఉన్నా ఈ ఎన్నికల ప్రచారం సాధారణ ఎన్నికలను సైతం మైమరిపిస్తున్నాయి. చివరికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం గమనర్హం. ఈ ఎన్నికలను రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెండ్ కెటిఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్వయంగా వారే రంగంలోకి దిగడంతోపై నుంచి క్రింది స్థాయి వరకు గులాబీ శ్రేణులంతా నడుంబిగించి ముందుకు సాగుతున్నారు.

పల్లా విజయం కోసం మూడు జిల్లాల పరిధిలో నలుగురు మంత్రులు, దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు, ముగ్గరు ఎంపిలు, నలుగురైదుగురు ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఎంపిపిలు, జెడ్పీటీసిలు, సర్పంచ్‌లు ఎంపిటిసిలు వార్డు మెంబర్లు, కార్పొరేటర్లు, మేయర్లతో పాటు బూత్ స్థ్ధాయి నుంచి గ్రామ స్థాయి మండల, నియోజకవర్గ స్ధాయి వరకు ఉన్న టిఆర్ ఎస్ కార్యకర్తలు పల్లా గెలుపుకోసం అహోరాత్రలు శ్రమిస్తున్నారు పోలీంగ్ బూత్‌ల వారిగా ఓటర్ జాబితాను చేత బట్టుకొని ప్రతి ఓటర్‌ను నేరుగా కలిసి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఇక్కడ ఓటు హక్కు నమోదు చేసుకొని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులను పోలీంగ్ రోజు ఖమ్మంకు రప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రధాన పార్టీ అభ్యర్థులంతా తెలంగాణ రాష్ట్రం ఏజెండాగా ఈ ఎన్నికల ప్రచారంలోకి దిగిన విషయం తెలిసిందే. నీళ్ళు, నిధులు, నియామకాలు గురించి అభ్యర్థ్ధులు అనుకూల, ప్రతికూల మాటలతో ప్రచారంలో దుసుకేళ్తున్నారు.ప్రధాన పార్టీ అభ్యర్ధులు ఈ ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే ప్రచార పర్వంలోకి దిగారు. పట్టభద్రుల ప్రచారంలో అధికార టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థ్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డి అగ్రభాగాన ఉన్నారు. 12జిల్లాల పరిధిలో ఆ పార్టీకి బూత్ స్థాయి నుంచి నియోజకవర్గం కేంద్రం వరకు పటిష్టమైన పార్టీ శ్రేణులు ఉండటంతో వారంతా పట్టభధ్రుల ఓటు హక్కు కలిగిన వారింటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ కేంద్రంలో, మండలాల్లో అసెంబ్లీ ఎన్నికలను తలపించే విధంగా ప్రచారం చేస్తున్నారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథాడ్, జి జగదీశ్ రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌లతో పాటు సర్వత్రా పార్టీ యంత్రాంగం మొత్తం ఓట్ల ప్రచారంలో బిజిగా ఉన్నారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి రాము లు నాయక్ పూర్తిగా వెనుకబడ్డారు. బిజెపి అభ్యర్థ్ధి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ప్రొపెసర్ కోదాండరామ్, డాక్టర్ చెరుకు సుధాకర్, రాణి రుద్రమారెడ్డి, తీన్మార్ మల్లన్న తదితరులు కూడా విస్తృతంగా పర్యటించి ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News