Saturday, April 27, 2024

అన్ని రాజకీయ పార్టీలు కురుమ కులస్తులకు ఎమ్మెల్యే టికెట్లను కేటాయించాలి

- Advertisement -
- Advertisement -

గోషామహల్ : రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు కురుమ కులస్తుల జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలని రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేషం డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ముస్లీం జంగ్ పూల్ వంతెన వద్ద ఉన్న రాష్ట్ర కురుమ సంఘం భవనంలో వివిధ జిల్లాలు పదాధికారుల సమావేశం నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి యెగ్గె మల్లేషం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధికంగా జనాభా కురుమ కులస్తులు కలిగి ఉన్నప్పటికీ చట్టసభల్లో స్థానం లభించడం లేదని ఆవేదన.. చేశారు. కురుమల ఓట్లతో అన్ని రాజకీయ పార్టీలు సీట్లు సాధిస్తున్నాయని కానీ తమకు మాత్రం అభ్యర్థులను ప్రకటించడం లేదని ఆరోపించారు.

కురుమల సత్తాను చాటేందుకు సెప్టెంబర్ 9 లేదా 12వ తేదీల్లో భువనగిరిలో కురుమ సింహగర్జన లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రానున్న, అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడైతే కురుమ జనాభా ఎక క్కువగా ఉందో అక్కడ కురుమ జాతికి చెందిన నాయకుడికి ఆయా పార్టీలు టికెట్ ఇస్తే గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. కేవలం కురుమల ఉచ్పే కావాలి వారికి రాజకీయ ప్రాధాన్యత ఇవ్వలేమని. చెప్పే పార్టీలకు రానున్న ఎన్నికల్లో కురుమ ఓట్లతో ఆయా పార్టీలను భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. తమ కులానికి చెందిన ఎమ్మెల్యేలను చెట సేవలో ఉంటే కురుమ జాతికి వారి సమస్యలు. పరిష్కారానికి అండగా ఉంటారని యెగ్గె మల్లేషం తెలిపారు.

అధికార పార్టీ కేవలం ఎమ్మెల్సీ పదవి ఇచ్చి చేతులు దులుపుకుందని ఇప్పటివరకు తమ కులానికి చెందిన ఏ ఒక్కరికి చైర్మన్, డైరెక్టర్ల పదవులు దక్కలేదని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, బీఅర్‌ఎస్ పార్టీల అధినాయకులు పురుమలకు రాజకీయంగా ఎదగడానికి ఈ ఎన్నికల్లో అత్యధిక ఎమ్మెల్యే సీట్లను కేటాయిస్తే ఆ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం రాష్ట్ర నాయకులు క్యామి మక్షేమం, బండారు నారాయణ, కట్ట చుట్టివం కొలువులు నరసింహ, ఎక్కాల బన్నా, కొండల రాజు, బూరగడ్డ నగేష్, కంద్యాల క్రీసు, వీర శ్రీకాంత్, అరుణి వమార్, తమ్మగొండ బాలమణిలతో పాటు వివిధ అర్ధాల నుంచి అధ్యక్షులు, ముఖ్య పల సుమాల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News