Wednesday, May 1, 2024

మత సామరస్యానికి తెలంగాణ మారుపేరు: కొప్పుల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బక్రీద్ పర్వదినం సందర్భంగా ముస్లిం సమాజానికి మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సిఎం కెసిఆర్ సుపరిపాలనలో ముస్లింలతో పాటు అన్ని వర్గాల ప్రజలు గౌరవప్రదంగా జీవిస్తున్నారని కొనియాడారు.  మత సామరస్యానికి తెలంగాణ మారుపేరుగా నిలిచిందన్నారు.  ఈ సందర్భంగా కొప్పుల మీడియాతో మాట్లాడారు.  పేదింటి ఆడబిడ్డల పెళ్లికి షాదీ ముబారక్ పథకం ద్వారా లక్షా 116 రూపాయలు ఉచితంగా ఇస్తున్నామని,  ఇప్పటివరకు 1,87,976 మందికి షాదీ ముబారక్ ద్వారా 1454 కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు.  విదేశాలలో ఉన్నత విద్య కోసం 20 లక్షలు ఉచితంగా ఇస్తున్నామని, ఈ విధంగా 1683 మందికి  294 కోట్లు ఇచ్చామని మంత్రి కొప్పుల పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2004-14ల మధ్య 10 ఏండ్లలో 812 కోట్లు మాత్రమే మైనార్టీల కోసం ఖర్చు చేశారని,  తెలంగాణలో ఆరు ఏళ్లలో  5712 కోట్లు ఖర్చు పెట్టామని వివరించారు. మైనారిటీల సంక్షేమానికి ఈ సంవత్సరం బడ్జెట్ లో 1630 కోట్లు కేటాయించామన్నారు.   బక్రీద్ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ఈద్గాలలో అవసరమైన సదుపాయాలు కల్పించామని మంత్రి ఈశ్వర్ తెలిపారు. త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగా అని, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకోవాలని, కరోనా మహమ్మారిని పారదోలేందుకు, తెలంగాణ సుభిక్షంగా ముందుకు సాగాలని కోరుతూ ప్రార్థనలు చేయాల్సిందిగా ముస్లిం సమాజాన్ని మంత్రి కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News