Tuesday, May 21, 2024

నేడు బక్రీద్ పండుగ

- Advertisement -
- Advertisement -

పోటా పోటీగా పొట్టేళ్ల కొనుగోళ్లు
అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన జిహెచ్‌ఎంసి
గోవుల అక్రమ రవాణ కట్టడికి ప్రత్యేక చర్యలు
పట్టుబడ్డ పశువుల సంరక్షణకు ప్రత్యేక కేంద్రాలు

Bakrid festival in Hyderabad

మన తెలంగాణ/సిటీ బ్యూరో: నగరంలో బక్రీద్ పం డుగకు జిహెచ్‌ఎంసి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. పండుగ సందర్భంగా శానిటేషన్‌పై అధికారులుఉ ప్ర త్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా జంతువుల వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు అదనంగా 400 పై చిలుకు వాహనాలను జిహెచ్‌ఎంసి ఏర్పాటు చేసింది. ఇందులో 25, 10 టన్నుల సామర్థంతో పా టు 5 టన్నుల టిప్పర్లను సైతం వినియోగించనున్నా రు. వీటితో పాటు వ్యర్థాలను సేకరించేందుకు గాను అన్ని సర్కిళ్లల్లో దాదాపుగా 4.50 లక్షల పై చిలుకు ప్లాస్టిక్ కవర్లను సైతం పంపిణీ చేశారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని ముస్లిం సొదరుల సమూహిక ప్రార్థనలకు ప్రధాన ఈద్గాల వద్ద జిహెచ్‌ఎంసి ప్రత్యేక ఏర్పాట్లను చేసింది.

పోటా పోటీగా కొనుగోళ్లు

బక్రీద్ పండగ సందర్భంగా మేకలు, గొర్రెలకు ఎక్కడా లేని గీరాకీ వచ్చిపడింది. పండుగను పురస్కరించుకుని ఖుర్భానీ ఇవ్వడానికి ముస్లిం సొదరులు మేకలు, గొర్రె ల పోటీల మీద కొనుగోళ్లు చేస్తున్నారు. సాధారణ సమయాల్లో రూ. 5వేలు పలికే గొర్రెలు, మేకలు రూ. 10 వేలకు పైగా ధర పలికింది. అంతేకాకుండా ప్రత్యే క జాతికి చెందిన మేక, గొర్రె పొటేళ్ల ధరలు రూ. 20వేల నుంచి లక్ష రూపాయాలవరకు ధర పలికాయి. నగర చుట్టు పక్కన ఉన్న వివిధ ప్రాంతాల నుంచి గొర్రెలు, మేకలను భారీ సంఖ్యలో ఇక్కడి తీసు కు వచ్చి అమ్మకాలు చేపట్టారు. పండుగ నేడే కావడం తో మంగళవారం వ్యాపారాలు మేకలు, గొర్రెల ధరలను అమాంతం పెంచేశారు. ముషీరాబాద్, భోలక్‌పూర్, బోయినపల్లి, రసుల్‌పురా, చార్మినార్, చంద్రాయణ్‌గుట్ట, మలక్‌పేట్, కార్వాన్, మెహిదిపట్నం, బ ర్కాస్, టొలిచౌకి, పురానపూల్, ప్రాంతాల్లో ప్రత్యేకం గా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక బారికేడ్లను ఏర్పాటు చేసి అమ్మకాలను చేస్తున్నారు.

అక్రమ రవాణ కట్టడికి ప్రత్యేక చర్యలు:

బక్రీద్ పండుగ సందర్భంగా ఆవులు, ఒంటెలు ఇతర జంతువులు అక్రమ రవాణ కట్టడికి ప్రత్యేక చర్యలు తీ సుకున్నారు. ఇందులో భాగంగా పోలీసులు నగరంలో ని అన్ని ప్రధాన రహదారులపై ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భం గా సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న ఆవులు, ఒం టెలు ఇతర పశువులను పట్టుకుని ప్రత్యేక కేంద్రాల కు తరిలించారు. ఇందుకు సంబంధించి జిహెచ్‌ఎంసి గ్రేటర్ పరిధిలో ప్రత్యేకంగా తాత్కాలికంగా సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులోభాగంగా ఎల్‌బినగర్, చార్మినార్ జోన్లకు సంబంధించి అక్రమ రవాణలో పట్టుబడ్డ పశువులను కోసం ఫతుల్లాగూడలో సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ జోన్ కు సంబంధించి పటేల్ నగర్, శేరిలింగంపల్లి జోన్‌కు గాను నలగండ్ల, కూకట్‌పల్లి, సికింద్రాబాద్ జోన్లకు సంబంధించి మహదేవ్‌పూర్‌లో తాత్కాలిక సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టుబడిన పశువులు, ఒంటెల సంరక్షణ కోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయడంతోపాటు వాటికి కావాల్సిన దాణ, పశు గ్రాసం ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News